క్యాబ్ డ్రైవర్ ఆకస్మిక మరణం, బ్యాంకు వాయిదాలు చెల్లించకలేక ఒత్తిడితో మరణం

ఓ ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొన్న క్యాబ్ డ్రైవర్ తమకు సక్రమంగా గిరాకీ ఇవ్వడం లేదని డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు.అయితే మరోవైపు బ్యాంకు వాయిదాలు చెల్లించాలని బ్యాంకు అధికారులు ఒత్తిడి తేవడంతో

హైదరాబాద్ :క్యాబ్ డ్రైవర్ తులసీదాస్ మరణించాడు. క్యాబ్ కొనుగోలుచేసేందుకు బ్యాంకు నుండి తీసుకొన్న నెలవాయిదా చెల్లించడం లేదని బ్యాంకు సిబ్బంది ఒత్తిడి తేవడంతో ఆయన హైబిపితో ఆసుపత్రిలో మరణించాడు.విషయం తెలుసుకొన్న డ్రైవర్లు ఆసుపత్రి వద్దకు చేరుకొన్నారు.

తులసీదాస్ అనే డ్రైవర్ ఓ ప్రైవేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని కారు నడుపుతున్నాడు. అయితే కారును బ్యాంకు రుణం తీసుకొని కొనుగోలుచేశాడు. ఇటీవల కాలంలో ఆ కంపెనీల నుండి తమకు గిరాకీలు రావడం లేదని క్యాబ్ డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు.

cab driver sudden death

తులసీదాస్ కూడ వారితో కలిశాడు. అయితే క్యాబ్ నెలసరి వాయిదా చెల్లించాల్సిన సమయం వచ్చేసింది. ఈ బకాయిలను చెల్లించాలని బ్యాంకు సిబ్బంది కారు డ్రైవర్ తులసీదాస్ పై ఒత్తిడి తెచ్చాడు.

ఒకవైపు గిరాకీ లేదు. మరో వైపు నెలసరి వాయిదా చెల్లింపు కోసం బ్యాంకు సిబ్బంది నుండి ఒత్తిడి పెరగడంతో తులసీదాస్ తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాడు. ఈ ఒత్తిడికి గురైన అతను అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనతో క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. కాగా, క్యాబ్ డ్రైవర్లు నిరసనగా ముఖ్యమంత్రి ఇంటికి మృతదేహాన్ని తీసుకు వెళ్లే ప్రయత్నం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+