మంత్రి అజారుద్దీన్ కు పదవీ గండం, ఆ ఒక్కటే ఆప్షన్..!?

మంత్రి అజారుద్దీన్ కు పదవీ గండం ముప్పు పొంచి ఉంది. మంత్రిగా కొనసాగుతారా..లేదా ఇప్పుడు ఇదే చర్చ అధికార పార్టీలో ఎక్కువగా జరుగుతోంది. అజారుద్దీన్ మంత్రి పదవి చేపట్టి ఆరు నెలల కాలం పూర్తవుతోంది. ఎమ్మెల్సీగా ఇంకా ఆమోదం లభించలేదు. ఆరు నెలల్లోగా చట్ట సభ సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంది. దీంతో.. మంత్రిగా అజారుద్దీన్ కొనసాగింపు విషయం లో రేవంత్ ఆలోచన ఏంటి.. ముందున్న ప్రత్యామ్నాయాలేంటి..

మంత్రిగా అజారుద్దీన్ బాధ్యతలు చేపట్టి ఆరు నెలల గడువు సమీపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా హడావిడిగా అజారుద్దీన్ మంత్రివర్గంలోకి తీసకున్నారు. అయితే వచ్చే నెల 30వ తేదీతో ఆయన మంత్రి పదవి చేపట్టి ఆరు నెలలు ముగుస్తుంది. మంత్రి అయిన తరువాత ఆరు నెలల్లోపు చట్టసభల్లో సభ్యుడిగా ఎంపిక కావాల్సి ఉంటుంది. కానీ ఇంకా ముప్ఫయి రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఎమ్మెల్సీ పదవిని భర్తీ చేసే అవకాశం కష్టంగా మారుతోంది. దీంతో.. ప్రభుత్వం ముందు ఉన్న ఆప్షన్లు ఇప్పుడు కీలకంగా మారుతున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల్లో ఎవరితో అయినా రాజీనామా చేయించాలి. దీని కోసం ఇద్దరి పేర్లు పార్టీలో ప్రచారం లో ఉన్నాయి. వారి స్థానంలో అజారుద్దీన్ ను ఎమ్మెల్సీ చేసే విధంగా ఆలోచన జరుగుతోంది.

Cabinet Minister Azharuddin must get elected to either the legislative council or the assembly before April 30

అజారుద్దీన్ కోసం సీఎం రేవంత్ కొత్త వ్యూహాం

అజారుద్దీన్ ఎమ్మెల్సీ నిర్ణయం పైన కొత్తగా వచ్చిన గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవకతవకలను సాకుగా చూపి గతంలో సుప్రీంకోర్టు పదవి నుంచి తప్పుకోవాలని చెప్పడంతో గవర్నర్ అభ్యంతరం చెప్పే అవకాశాలు ఉన్నాయనే వాదన ఉంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కాలంటే కొంత కష్టమైన పనేనన్నది కాంగ్రెస్ నేతలు అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నారు. పార్టీ హైకమాండ్ మాత్రం అజారుద్దీన్ ను కేబినెట్ లో కొనసాగించాలని.. ఎమ్మెల్సీ పదవి విషయంలో అవసరమైన నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ కు సూచించినట్లు సమాచారం.

త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు కూడా జరుగుతున్న సమయంలో సందిగ్ధంలో అజారుద్దీన్ మంత్రి పదవి పడిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో సమస్యగా మారుతోంది. ఒక వైపు అజారుద్దీన్ నియామకం పెండింగ్‌లో ఉండగానే, రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయనే ప్రచారం జోరందుకుంది. దీంతో.. ఇప్పుడు సీఎం రేవంత్ మంత్రిగా అజారుద్దీన్ ను కొనసాగించే విషయంలో .. ఎమ్మెల్సీ పదవి పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+