హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహేష్ స్థానంలో నేనుంటే: కేటీఆర్, అదే పనిలో కేసీఆర్, షాకింగ్ విషయం చెప్పిన సూపర్‌స్టార్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మహేష్‌బాబు అనేకమంది యువతకు స్ఫూర్తి అని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేటీఆర్ ఇటీవ‌ల భ‌ర‌త్ అనే నేను చిత్రం స్పెష‌ల్ స్క్రీనింగ్ వీక్షించిన సంగ‌తి తెలిసిందే. చిత్రానికి మంచి టాక్ రావడంతో పాటు థీమ్ గురించి అందరు గొప్పగా మాట్లాడుతుండడంతో కేటీఆర్ ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపారు.

సినిమా బాగా నచ్చడంతో తన ట్విట్టర్ ఖాతాలో హీరో మహేష్, దర్శకుడు కొరటాల శివని అభినందించారు. సినిమా చాలా ఎంజాయ్ చేశానని స్నేహితుడు మహేష్, డైరెక్టర్ కొరటాల శివతో ఇంటరాక్షన్ జరిపినట్టు కేటీఆర్ తన ట్వీట్ ద్వారా తెలిపారు. అయితే ఈ సినిమా త‌న రియ‌ల్ లైఫ్‌కి కూడా కాస్త ద‌గ్గ‌ర‌గా ఉండ‌డంతో మ‌హేష్ బాబు, కొర‌టాల శివ‌తో క‌లిసి ఇంట‌రాక్ష‌న్ జ‌రిపారు.

మహేష్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి

మహేష్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘మహేష్‌ యువతకే కాదు అందరికీ స్ఫూర్తి. ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఆయనో సూపర్‌స్టార్‌. ఎంతో క్రమశిక్షణతో ఎదిగారు. ఇంత మంచి విజయాన్ని అందుకున్న మహేష్‌కు శుభాకాంక్షలు. ఇదివరకు 100 రోజులు 200 రోజులు ఆడేవి. ఇప్పుడు రూ.100 కోట్లు.. రూ.200 కోట్ల లెక్కల ప్రకారం ఆడుతున్నాయి. ఈ సినిమా కూడా మరిన్ని కలెక్షన్లతో విజయం పథంలో నడవాలి. అంతేకాదు మహేష్‌ కూడా ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఈ చిత్రంలో రెండుమూడు అంశాలు బాగా నచ్చాయి' అని తెలిపారు.

సీఎం కేసీఆర్ కూడా ఆ పని చేయబోతున్నారు

సీఎం కేసీఆర్ కూడా ఆ పని చేయబోతున్నారు

‘ఒకవైపు సందేశం, మరోవైపు సక్సెస్‌ కావాలంటే సినిమాలో కచ్చితంగా నాటకీయత ఉండాలి. దాన్ని దర్శకుడు తీసుకున్నారు. సినిమాలో చెప్పిన జవాబుదారీతనం నాకు బాగా నచ్చింది. మనల్ని ఎన్నుకున్న ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న సందేశం బాగుంది. ఇంకొకటి సువిశాల భారతదేశంలో ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. భారీగా కరెంట్‌ను ఉత్పత్తి చేసే దేశంగా పేరున్నా..ఇంకా విద్యుత్‌ లేని గ్రామాలు ఉన్నాయి. దేశంలో గంగా, బ్రహ్మపుత్ర లాంటి జీవనదులు ఉన్నా.. గుక్కెడు నీళ్ల కోసం కిలోమీటర్లు నడిచి వెళ్లే పల్లె ప్రజలు ఉన్నారు. ఇలా ఎక్కడో ఒక చోట వ్యత్యాసం ఉంది. సినిమాలో మీరు లోకల్‌ గవర్నెన్స్‌ అంశాన్ని చెప్పడం కూడా బాగుంది. త్వరలోనే సీఎం కేసీఆర్‌ దీనిని అమలు చేయబోతున్నారు' అని అని కేటీఆర్ వెల్లడించారు.

ప్రజలు వూరుకోరు.. సిగ్గుపడాలి

ప్రజలు వూరుకోరు.. సిగ్గుపడాలి

‘మూడోది విద్యా, వైద్యం అంశాలను కూడా చాలా చక్కగా చెప్పారు. చివరిగా మీడియా ఏరకంగా ప్రవరిస్తుందో కూడా చాలా బాగా చూపించారు. రోజు మేము పడే బాధను కూడా చూపించినందుకు మా తరపున ధన్యవాదాలు. మీడియాలో లెక్కలేని తనం పెరిగిపోయిందన్నారు. సినిమాలో మహేష్‌ సీఎం అవగానే ట్రాఫిక్‌ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సినిమా చూసి ఇన్‌స్పైర్‌ అయి, నేను కూడా అలా చేస్తే మీరు(ప్రజలు) వూరుకోరు. అది నాకు తెలుసు. అయితే, సినిమా చూసి కాస్త సిగ్గుపడి తప్పు చేయకుండా ఉంటే చాలు. పౌరులంతా బాధ్యతగా వ్యవహరించాలి' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

‘స్టాప్‌ డూయింగ్‌ నాన్సెన్స్‌ లైక్‌ దిస్‌'

‘స్టాప్‌ డూయింగ్‌ నాన్సెన్స్‌ లైక్‌ దిస్‌'

ఇక మహేష్‌బాబు మాట్లాడుతూ.. ‘మా సినిమా చూసిన కేటీఆర్‌ సర్‌కు ధన్యవాదాలు. (మధ్యలో కేటీఆర్‌ కల్పించుకు జస్ట్‌ రామ్‌ అని పిలవండి) ‘భరత్‌ అనే నేను' బృందాన్ని కేటీఆర్‌ అభినందించడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు నా సినిమాలు చూసినా నాకు టెన్షన్‌. బాగుంటే బాగుందని చెప్తారు. లేకపోతే చెప్పరు. నాకు బాగా గుర్తు ‘ఆగడు' చూసి ‘స్టాప్‌ డూయింగ్‌ నాన్సెన్స్‌ లైక్‌ దిస్‌' అన్నారు. అంత నిజాయతీగా ఉంటారు' అని షాకింగ్ విషయం మహేష్ చెప్పారు.

నేనే మహేష్ స్థానంలో ఉంటే: కేటీఆర్

నేనే మహేష్ స్థానంలో ఉంటే: కేటీఆర్

కాగా, ఈ సందర్భంగా మహేష్, కేటీఆర్‌ని ఉద్దేశించి మీ ఇద్దరూ ఒకరి రోల్స్ ఒకరు ఛేంజ్ చేసుకుంటే.. కేటీఆర్‌ని ఏ సినిమా చేస్తారు అని.. అలాగే మహేష్‌ని ఏ ఫైల్ మీద మొదట సంతకం చేస్తారని ఓ యువకుడు ప్రశ్నించారు. దీనికి వెంటనే కేటీఆర్ ‘నేను హాలిడేకు వెళ్తాను' అన్నారు. మహేష్ ఏం చేస్తాడో అని క్యూరియస్‌గా ఉందన్నారు. ‘సంవత్సరంన్నరగా సినిమా చేశాను. మీ పని ఎంత కష్టమో నాకు తెలుసు నేను మీతో కలిసి హాలిడేకి వెళ్లడానికి ఇష్టపడతాను' అన్నాడు మహేష్. వెంటనే కేటీఆర్ ‘మేమిద్దరం నీకు దొరకట్లేదు కదా' అని నవ్వుతూ అన్నారు. ‘నేనే మహేష్‌ని అయితే న్యూ లుక్‌లో కనిపించేందుకు ట్రై చేస్తాను. నేను రస్టిక్‌గా.. డ్రమేటికల్లీ డిఫరెంట్.. ఆబ్సిల్యూట్‌గా ఇప్పటి వరకూ ట్రై చేయని దాన్ని ట్రై చేస్తాను' అని కేటీఆర్ చెప్పారు. వెంటనే ‘అవన్నీ నా నెక్ట్స్ ఫిల్మ్‌లో చేస్తున్నాను' అని మహేష్ చెప్పారు.

English summary
Mahesh Babu's latest film Bharat Ane Nenu directed by Koratala Siva has been running successfully at the box-offices. Not only people of the two Telugu States of Telangana and Andhra Pradesh have appreciated the movie, even politicians of the states have taken a liking to Mahesh Babu's Bharat Ane Nenu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X