మంత్రి హరీశ్‌రావుపై కేసు కొట్టివేత: కాకతీయకు రూ. 50లక్షల విరాళం
వరంగల్: రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి హరీష్‌రావుపై ఉన్న ఎన్నికల కేసు గురువారం కొట్టివేశారు. 2012 జులై 30న పరకాల ఉప ఎన్నికల సందర్భంగా మంత్రి హరీష్‌రావుపై నమోదైన ఎన్నికల కేసుపై విచారణ జరుగింది.
రెండు రోజుల క్రితమే ఈ కేసులో మంత్రి హరీష్‌రావు వరంగల్ కోర్టుకు హాజరై వెళ్లారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలు నిరూపించలేకపోవడంతో కేసును కొట్టివేస్తున్నట్లు 3వ అదనపు మెజిస్ట్రేట్ అన్వేష్‌కుమార్ తీర్పునిచ్చారు.

మిషన్ కాకతీయకు రూ. 50 లక్షల విరాళం
మిషన్ కాకతీయకు బాలాజీ అమైన్స్ లిమిటెడ్ కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి 50లక్షల 55వేల రూపాయల విరాళం అందజేశారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును కలిసి ఈ విరాళాన్ని అందజేశారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామం, రంగ సముద్రం చెరువు పునరుద్ధరణ కోసం ఈ విరాళం అందజేస్తున్నట్టు చెప్పారు. ఈ చెరువుకోసం అయ్యే మొత్తం వ్యయాన్ని ఒకేసారి విరాళంగా ఇచ్చారు.
అప్పటి వరకు పడావుగా ఉన్న చెరువులు మిషన్ కాకతీయ ప్రారంభం తర్వాత పొంగిపొర్లడం చూసి ఆనందంగా ఈ విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రతాప్‌రెడ్డి మంత్రికి తెలిపారు. మిషన్ కాకతీయ కోసం దాతలు ఇదే ఉత్తేజంతో ముందుకు రావాలని మంత్రి హరీశ్‌రావు కోరారు.












Click it and Unblock the Notifications