ఎలక్షన్ టైం : లోన్ కోసం యాక్టివిస్ట్ దరఖాస్తు .. సోషల్ మీడియాలో వైరల్
హైదరాబాద్ : ఓట్ల పండుగ వచ్చేసింది. ఇక సీటు కోసం అభ్యర్థుల పోటిపడతారు. సీటు .. ప్రచారం ... ఓటర్లను ప్రలోభాలకు గురిచేయాలన్న డబ్బులు కావాలి. ఈ క్రమంలో వెంకట నారాయణ అనే సామాజికవేత్త చేసిన ప్రయత్నం సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ అవుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున లోన్ ఇవ్వాలని బ్యాంకును లోన్ అడిగారు. తనకు ప్రజాసేవ చేయాలనే ఆశ ఉన్నదని .. కానీ పోటీ చేసేందుకు కావాల్సినంత డబ్బులు లేదని పేర్కొన్నాడు. ఈ క్రమంలో లోన్ ఇవ్వాలని కెనరా బ్యాంక్ కు ఆర్జీ పెట్టుకున్నాడు.

సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి ..
హైదరాబాద్ కు చెందిన వెంకటనారాయణ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నాడు. అందుకోసం లోన్ ఇవ్వాలని నల్లకుంట కెనరా బ్యాంకులో ఆప్లై చేశాడు. రంగాలవారికీ ఆర్బీఐ రుణాలు ఇస్తోందని, ఆ విధంగానే సామాన్యులు, సామాజిక కార్యకర్తలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కావాల్సిన రుణాలు ఇవ్వాలని కోరారు.

2014లో అంబర్ పేట నుంచి పోటీ
ఇప్పుడే కాదు 2014లో కూడా వెంకటనారాయణ పోటీ చేశారు. అంబర్ పేట నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు తన వద్ద డబ్బులు లేకపోవడంతో భిక్షాటన కూడా చేసి వార్తల్లో నిలిచారు.

మోసగాళ్లకు కోట్ల రుణం .. మరి మాకు ..?
బ్యాంకుల నుంచి వందల కోట్ల రుణం తీసుకొని .. బడాబాబులు మోసగిస్తున్నారని వెంకటనారాయణ ప్రస్తావించారు. మరి సామాజిక కార్యకర్తలు ఎన్నికల్లో పోటీ చేయడానికి లోన్ ఇవ్వమని అడిగితే ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నిస్తున్నారు. వారికో న్యాయం .. మాకో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. దేశంలో సామాజిక కార్యకర్తలు, సామాజిక ఉద్యమకారులకు న్యాయం జరగడం లేదన్నాడు. ఎన్నికల్లో పోటీచేయడానికి బ్యాంక్ లోన్ ఇవ్వాలని పార్లమెంట్ లో బిల్లు పెట్టి అమలుచేయాలని కోరుతామని చెప్తున్నాడు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications