ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల సిత్రాలు స్టార్ట్..! ప్ర‌చారానికి సిద్ద‌మ‌వుతున్న ర‌థాలు..!!

హైదరాబాద్ : ఎన్నిక‌ల చిత్రాలు మొద‌ల‌య్యాయి. ఓట్ల కోసం. ఎన్నిక‌ల్లో ఖ‌ర్చుల‌ను భ‌రించేందుకు అభ్య‌ర్థుల ఆప‌సోపాలు కూడా మొద‌ల‌య్యాయి. బాగ్‍అంబర్ పేటకు చెందిన వెంకటనారాయణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని వినూత్న పద్ధతిలో విరాళాలు సేకరిస్తున్నాడు. ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం సహాయం చేయమంటూ ప్రజలను అభ్యర్థిస్తున్నాడు. గతంలో ఎన్నికల్లో పోటీ చేయబోతున్నందున ఖర్చులకు లోన్ కావాలంటూ నల్లకుంటలోని కెనరా బ్యాంకుకు అప్లై చేసుకున్నాడు. రూల్స్ ప్రకారం ఇటువంటి లోన్ ఇవ్వడం సాధ్యం కాదని బ్యాంక్ వారు తేల్చిచెప్పారు .

దీంతో ప్రచార ఖర్చుల కోసం కొత్తగా సికింద్రబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రాంతాల్లో ప్రజల నుంచి విరాళాలు సేకరించడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయడం డబ్బుతో కూడుకున్నవ్యవహారం అని ర‌మ‌ణ చెప్పుకొస్తున్నాడు. కేవలం డబ్బు, మందు పంపిణీ చేయడమే అర్హతగా మారిందన్నాడు. ప్రజల నుంచి విరాళాలు సేకరించి సికింద్రబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పాడు.

candidates action starts in elections..! also campaign vehicles too..!!

ఎన్నికల పర్వం లో ప్రచారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఇందులో ప్రచార రథాలదే కీలక పాత్ర. రకరకాల పరిస్థితుల్లో ప్ర‌చారం చేయాల్సి ఉంటుంది కాబట్టి సౌకర్యవంతమైన వాహనాలను తయారు చేయించుకోవడానికి ప్రతినాయకుడు ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం తెలంగాణలో లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యం లో సిటీలో ప్రచార రథాలు ఆగమేఘాల మీద తయార వుతున్నాయి.

కుత్బుల్లా పూర్ సూరారం పారిశ్రామికవాడలో ఎస్.ఎస్.ఇండస్ట్రీస్ ప్రచార రథాల తయారీకి పెట్టింది పేరు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇక్కడ ప్రచార రథాల తయారీ జోరుగా సాగుతుంది. ఈసారి ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో వేగంగా రథాలు తయారవుతున్నాయి. ఒక్కోవాహనాన్ని తయారు చేయడానికి సుమారు 2.50ల రూపాయ‌ల వరకు ఖర్చవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+