లిఫ్ట్‌లో చిక్కుకుపోయిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత

హైదరాబాద్: సికింద్రాబాద్ న్యూ బోయిన్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వార్షికోత్సవానికి హాజరైన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత లిఫ్ట్‌లో చిక్కుకుపోయారు. ఆస్పత్రి మూడో అంతస్తుకు వెళ్లేందుకు ఆమె లిఫ్ట్ ఎక్కారు. ఆమెతోపాటు పరిమితికి మించిన సంఖ్యలో తొమ్మిది మంది లిఫ్ట్ ఎక్కడంతో సాంకేతిక లోపం తలెత్తి డోర్లు మూసుకుపోయి.. లిఫ్ట్ సెల్లార్‌లోకి వెళ్లింది.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే లాస్య నందిత పదిహేను నిమిషాల పాటు లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది లిఫ్ట్ డోర్లు పగులగొట్టడంతో ఎమ్మెల్యేతో పాటు అందులో చిక్కుకున్న వారు సురక్షితంగా బయటకు వచ్చారు. ఎవరికీ ఎలాంటి హాని కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Cantonment MLA Lasya Nanditha stuck in lift in Secunderabad

కాగా, కంటోన్మెంట్​ ఎమ్మెల్యే సాయన్నగత కొంత కాలం క్రితం మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ స్థానంలో బీఆర్​ఎస్​ అధిష్ఠానం ఆయన కుమార్తె లాస్య నందితకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందిత ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో బీఆర్ఎస్ గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలో ఒకరిగా ఉన్నారు.

అయితే, కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించి తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. ఇక బీజేపీకి 8 సీట్లు, ఎంఐఎంకు 7 స్థానాలు దక్కాయి. కాగా, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసే పనిలో పడింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే రెండు హామీలను అమలులోకి తీసుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+