బిర్లా మందిర్ వద్ద క్వాలిస్ బీభత్సం: ఆరుగురికి గాయాలు(ఫోటోలు)
హైదరాబాద్: బిర్లా మందిర్ వద్ద క్వాలిస్ వాహనం అదుపు తప్పిన ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బీహార్‌కు చెందిన కిషోర్ కుమార్ సింగాని, కిషన్ అగర్వాల్ భార్య, పిల్లలు, మమత, ఆమె తల్లితో కలిసి నగరానికి విహారయాత్రకు టయోటా క్వాలిస్ వాహనంలో వచ్చారు.
శుక్రవారం రాత్రి బిర్లా మందిర్‌కు వచ్చి దర్శనం చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో మందిరం ఎత్తు ప్రాంతం నుంచి దిగుతుండగా క్వాలిస్ వాహనం బ్రేకులు ఫెయిలయ్యాయి. డ్రైవర్ అప్రమత్తమై మందిరం, ఓ ఇంటికి మధ్యలో ఉన్న చిన్న సంధులోనికి పోనిచ్చాడు.
దీంతో క్వాలిస్ వాహనం ఆ పక్కనే ఉన్న చిన్న గోడపై నుంచి కిందకు పడింది. ఈ ప్రమాదంలో కిషోర్ కుమార్ కుమారుడు హర్ష అగర్వాల్ కంటికి గాయమైంది. మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి.
వెంటనే వారిని స్ధానికులు సమీపంలో ఉన్న మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

బిర్లా మందిర్ వద్ద క్వాలిస్ బీభత్సం
బిర్లా మందిర్ వద్ద క్వాలిస్ వాహనం అదుపు తప్పిన ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

బిర్లా మందిర్ వద్ద క్వాలిస్ బీభత్సం
బీహార్‌కు చెందిన కిషోర్ కుమార్ సింగాని, కిషన్ అగర్వాల్ భార్య, పిల్లలు, మమత, ఆమె తల్లితో కలిసి నగరానికి విహారయాత్రకు టయోటా క్వాలిస్ వాహనంలో వచ్చారు.

బిర్లా మందిర్ వద్ద క్వాలిస్ బీభత్సం
శుక్రవారం రాత్రి బిర్లా మందిర్‌కు వచ్చి దర్శనం చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో మందిరం ఎత్తు ప్రాంతం నుంచి దిగుతుండగా క్వాలిస్ వాహనం బ్రేకులు ఫెయిలయ్యాయి. డ్రైవర్ అప్రమత్తమై మందిరం, ఓ ఇంటికి మధ్యలో ఉన్న చిన్న సంధులోనికి పోనిచ్చాడు.

బిర్లా మందిర్ వద్ద క్వాలిస్ బీభత్సం
దీంతో క్వాలిస్ వాహనం ఆ పక్కనే ఉన్న చిన్న గోడపై నుంచి కిందకు పడింది. ఈ ప్రమాదంలో కిషోర్ కుమార్ కుమారుడు హర్ష అగర్వాల్ కంటికి గాయమైంది. మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని స్ధానికులు సమీపంలో ఉన్న మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications