శంషాబాద్ విమానాశ్రయం దారిలో కారు దగ్ధం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ప్రమాదవశాత్తు ఓ కారు మంటల్లో చిక్కుకుంది. కారు నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. సంఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారమందించారు.

నాటుబాంబు పేలి వృద్ధురాలికి గాయాలు

అదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో ఓ నాటుబాంబు పేలి ఓ వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. బోధ్ మండలంలోని కౌట(బి)లో జంతువుల కోసం చేనులో పెట్టిన నాటుబాంబు పేలడంతో ఈ ప్రమాదం జరిగింది.

Car catches fire in Hyderabad

పేకాట శిబిరంపై పోలీసుల దాడి

హైదరాబాదులోని బోరబండలో పేకాట శిబిరం పైన పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పోలీసులు 10 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ.66 వేలు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

రైతు ఆత్మహత్య

కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలంలో ఓ రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయంలో నష్టం రావడంతో అప్పులపాలైన ఎల్లం అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+