ఆడవేషంలో కారు చోరీ: మామ ఇంటికే కన్నం
హైదరాబాద్: విచిత్రమైన రీతిలో జరిగిన ఓ దొంగతనం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సిసి కెమెరాలకు చిక్కకుండా దొంగలు కొత్త దారులు వెతుక్కుంటున్నారని చెప్పడానికి హైదరాబాదులో జరిగిన ఓ సంఘటన నిదర్శనంగా నిలుస్తుంది.
బంజారాహిల్స్‌లో నివసించే నవీన్ కండిల్య ఈ నెల 14న రాత్రి స్కోడాకారులో ఇంటికి వచ్చారు. కారు పార్క్ చేయాల్సిందిగా సెక్యూరిటీకి తాళాలిచ్చారు. తర్వాత కాసేపటికే సెక్యూరిటీ గార్డు ఫోన్‌చేసి ఎవరో కారు తీసుకుని పారిపోతున్నారని చెప్పాడు. ఆయన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేయగా, వారు సీసీ కెమెరాలో పరిశీలించి, కారు దొంగలించింది ఓ మహిళగా గుర్తించా రు.
అయితే, చోరీ చేసింది కొత్తగా చేరిన వాచ్‌మన్ సోనూ అని, సీసీ కెమెరాలో తన ముఖం రికార్డు కాకుండా మహిళ వేషం వేశాడని వెల్లడైంది. అతడి సెల్‌ఫోన్ ఆధారంగా బీహార్‌కు వెళ్లిన పోలీసులు కారు నాగ్‌పూర్ లో ప్రమాదానికి గురైనట్టు గుర్తించి, దాన్ని స్వాధీనం చేసుకున్నారు.

తిన్న ఇంటి వాసాలు లెక్కించాడో ప్రబుద్ధుడు. మేన మామ వద్ద ఉంటూ ఆయన ఇంటికే కన్నమేసి నగలు దొంగిలించాడు ఓ వ్యక్తి. వాటిని అమ్మే ప్రయత్నంలో మలక్‌పేట పోలీసులకు దొరికాడు.
కాలాడేరా నివాసి షేక్ ముస్తాఫాఖాన్ (30) ఆటోడ్రైవర్. సలీంనగర్‌లోని మేనమామ నూర్ ఇంట్లో ఉంటున్నాడు. ఈనెల 11న రాత్రి మేనమామ కుటుంబం ఇంట్లో లేకపోవటంతో తాళాలు పగులగొట్టి 3తులాల బంగారు నగలు, 35తులాల వెండి వస్తువులు చోరీచేసి పారిపోయాడు.
పోలీసులు మంగళవారం తనిఖీ చేస్తుండగా ముస్తఫా ఘనకార్యం వెల్లడైంది. అతన్ని అరెస్టుచేసి సొత్తును స్వాదీనం చేసుకున్నారు.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications