సహోద్యోగినితో శారీరక సంబంధం: వీడియోలు లీక్ చేసిన టెక్కీ
హైదరాబాద్: తన 47 ఏళ్ల సహోద్యోగినితో తాను సస్నిహితంగా ఉన్న వీడియోలను ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు లీక్ చేశాడు. హైదరాబాదులోని ఘట్కేసర్‌కు చెందిన టెక్కీ వీడియోలను వివిధ వేదిక ద్వారా బయటపెట్టాడు.
అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, పోలీసులు అతని పేరును గోప్యంగా ఉంచారు. కేసు దర్యాప్తులో ఉన్నందున అతని పేరును వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు.

ఆమెతో సంబంధం ఏర్పడింది
ఓ ప్రముఖ బహుళ జాతి సంస్థ (ఎంఎన్‌సి)లో పనిచేస్తున్న 28 ఏళ్ల టెక్కీ సంస్కృతి టౌన్‌షిప్‌లో ఉంటున్నాడు. తన సహోద్యోగిని అయిన మహిళతో అతనికి సంబంధం ఏర్పడింది.

శారీరకంగా కూడా ఒక్కటయ్యారు
క్రమంగా వారు శారీరికంగా కూడా కలిశారు. ఆమెకు తెలియకండా టెక్కీ తనతో ఆమె సన్నిహితంగా ఉన్న సన్నివేశాలను ఫోన్ ద్వారా వీడియోలు తీశాడు. కొన్ని వీడియోలను తన మిత్రులకు షేర్ చేశాడు.

వీడియోలు వైరల్ అయి
ఆ వీడియోలు వైరల్ అయి, బాధితురాలి బంధువుకు కూడా చేరాయి. దాంతో ఆమెను అప్రమత్తం చేశారు. దానిపై బాధితురాలు ఘట్కేసర్ పోలీసు స్టేషన్‌లో అతనిపై ఫిర్యాదు చేశారు.

టెక్కీపై కేసు నమోదు
అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సాక్ష్యాల ఆధారంగా వాస్తవాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు అంటున్నారు. టెక్కీని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications