బెట్టింగ్ యాప్ కేసులో స్టార్ హీరోలు .. బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పై కేసు
బెట్టింగ్ యాప్స్ ను ప్రొమోట్ చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ లిస్ట్ లో టాలీవుడ్ సెలబ్రిటీలు విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, హీరోయిన్ అనన్య నాగళ్ల ఉన్నారు. అయితే తాజాగా ఈ జాబితాలో టాలీవుడ్ బిగ్ స్టార్స్ నందమూరి బాలకృష్ణ, రెబల్ స్టార్ ప్రభాస్, గోపీచంద్ ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో స్ట్రీమ్ అవుతున్న అన్ స్టాపబుల్ షోలో ఓ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఫన్ 88 బెట్టింగ్ యాప్..
ఫన్ 88 బెట్టింగ్ యాప్ ను బాలకృష్ణ, ప్రభాస్, గోపిచంద్ లు ప్రమోట్ చేశారని రామారావు అనే వ్యక్తి పోలీసులకు ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గతంలో జరిగిన అన్ స్టాపబుల్ షోకు ప్రభాస్, గోపీచంద్ అతిథులుగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ లో ఫన్ 88 అనే బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారు. అయితే ఈ ఎపిసోడ్ చూసి తాను బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నానని.. బెట్టింగ్ ఆడి 83 లక్షలు పోగొట్టుకున్నానని రామారావు అనే వ్యక్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈమేరకు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ లపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

భయ్యా సన్నీ యాదవ్ కూ నోటీసులు..
బెట్టింగ్ యాప్స్ ప్రొమోట్ చేసిన సూర్యాపేట జిల్లాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ కు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. భయ్యా సన్నీ యాదవ్ దేశంలోకి ఎప్పుడు అడుగుపెట్టినా అరెస్టు చేస్తామని సూర్యాపేట పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సన్నీ యాదవ్ పాకిస్థాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications