అదే మంచిది: హైదరాబాదులో ఫిర్యాదుపై హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్
Recommended Video

తిరువనంతపురం/హైదరాబాద్: ఒరు అదర్ లవ్ సినిమాలో నటి ప్రియా ప్రకాశ్ వారియర్ హావభావాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ పాట దుమ్ము రేపుతోంది. అయితే ఈ పాట తమ మనోభావాలు దెబ్బతీస్తోందంటూ కొందరు ముస్లీం యువకులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
చదవండి: ప్రియ వారియర్ కనుసైగలకు ఫిదా, ఎవరీమె? యువత గుండె పిండేస్తున్న వీడియో
హైదరాబాదులోని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌లో మహమ్మద్ ముఖీత్ అనే ఇరవై ఏళ్ల విద్యార్థి కొందరు స్నేహితులతో కలిసి ఈ ఫిర్యాదు చేశారు. అతను ఫలక్‌నుమా డివిజన్ వట్టేపల్లి బస్తీకి చెందినవాడు.

ఫిర్యాదు, పోలీసులు ఏం చెప్పారంటే
మలయాళ చిత్రం ఒరు అదర్ లవ్‌లో ముస్లీంలను కించపరిచేలా లిరిక్స్ ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఓ వర్గాన్ని కించపరచడం లేదా మనోభావాలను దెబ్బతీయడం కింద సెక్షన్ 295ఏ ప్రకారం కేసు నమోదు చేసే అవకాశముంది. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

దర్శకుడిపై ఫిర్యాదు
ఈ చిత్రంలో తమ వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ దర్శకుడిపై వారు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దానిని పరిశీలన కోసం ఉన్నతాధికారులకు పంపించారు. నటి ప్రియ యాక్షన్ విషయంలో తమకు అభ్యంతరం లేదని తెలిపారు.

ఫిర్యాదుపై ప్రియాప్రకాశ్ వారియర్ ఏం చెప్పారంటే
హైదరాబాదులో తన సినిమా విషయంలో ఫిర్యాదుపై నటి ప్రియా ప్రకాశ్ వారియర్ కూడా స్పందించారని తెలుస్తోంది. ఊహించని పాపులారిటీకి ఎలా స్పందించాలో తనకు అర్థం కావడం లేదని, కన్ను గీటే సీన్‌ను రిహార్సల్స్ చేయకుండానే చేశానని చెప్పారు. ఫిర్యాదుల గురించి తనకు తెలియదని, దీనిపై మౌనంగా ఉండటమే మంచిది అనిపిస్తోందన్నారు.

ఓవర్ నైట్ స్టార్
కాగా, ఆమె నటించిన ఒరు అదర్ లవ్‌లోని మాణిక్య వలరయ అనే పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పాటలో ప్రియ పలికించిన హావభావాలకు యువత ఫిదా అయింది. సోషల్ మీడియాలో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయింది.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications