పోచారం ఇంట్లోకి దూసుకుపోయిన బీఆర్ఎస్ నేతలు.. బాల్క సుమన్ తోసహా 12మందిపై కేసులు నమోదు

తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బిఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలినట్టు అయింది. పోచారం శ్రీనివాస్ రెడ్డికి, ఆయన కుమారుడికి సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టగా, ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

పోచారం ఇంటిముందు ధర్నా
పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడంతో బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు, బీఆర్ఎస్ పార్టీ నేతలు కొందరు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని వార్తల నేపథ్యంలో వారంతా ధర్నాకు దిగారు. ఇక అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సీఎం రేవంత్ కాన్వయ్ ను అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు.

Cases have been registered against 12 BRS leaders who protested Pocharam srinivas reddy house

పోచారం ఇంట్లోకి దూసుకెళ్లిన బీఆర్ఎస్ నేతలు
దీంతో అక్కడ హై టెన్షన్ చోటుచేసుకుంది. పోచారం శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన బిఆర్ఎస్ పార్టీ నేతలు పార్టీ మార్పు పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే బిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పోలీసులకు కళ్ళు కప్పి సీక్రెట్ గా పోచారం ఇంట్లోకి వెళ్లారు. దీంతో అక్కడ హై టెన్షన్ చోటుచేసుకుంది. పోచారం ఇంటి వద్ద సెక్యూరిటీ వైఫల్యంపైన, సీఎంఓ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

బాల్క సుమన్ తో పాటు 11 మంది అరెస్టు
అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఉండగానే బిఆర్ఎస్ నేతలు చొచ్చుకురావడంతో భద్రతా లోపంపైన నివేదిక ఇవ్వాలని, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లోకి చొరబడిన బాల్క సుమన్ తో పాటు బిఆర్ఎస్ పార్టీ నేతలపైన చర్యలు ఉంటాయని పేర్కొన్న పోలీసులు బిఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. బాల్క సుమన్ తో పాటు 11మందిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టుకు తరలించారు.

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమంత్ తో పాటు మరో పదకొండు మందిపై ఐపిసి 353, 408 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇక బీఆర్ఎస్ నాయకులను కోర్టుకు తరలిస్తున్న సమయంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట బిఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

కేసులు నమోదైంది వీరిపైనే
పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు ఆందోళన చేసిన, పోచారం ఇంట్లోకి చొరబడిన కేసులో బాల్క సుమన్, మన్నే గోవర్ధన్ రెడ్డి, వాసుదేవరెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, కడారి స్వామి యాదవ్, ఆంజనేయ గౌడ, తుంగ బాలు, కే జంగయ్య, డి రాజు, వరికుప్పల వాసు, దూదిమెట్ల బాలరాజు యాదవ్, చత్తారి దశరథ్ లపైన పోలీసులు కేసులు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+