సండ్ర అరెస్ట్‌కు ఛాన్స్: ప్రైవేటు వ్యక్తులు వచ్చారన్న రేవంత్ (పిక్చర్స్)
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని భారీ భద్రత మధ్య న్యాయస్థానానికి తరలించారు. రేవంత్‌తో పాటు ఉదయ్ సిన్హా, సెబాస్టియన్‌లను కోర్టుకు తీసుకు వచ్చారు. రిమాండు పొడిగింపు అనంతరం తిరిగి జైలుకు తరలించారు.
కాగా, ఏసీబీ అధికారులు తనను కస్టడీలోకి తీసుకున్న సమయంలో సిట్ కార్యాలయంలోకి ప్రయివేటు వ్యక్తులు వచ్చి తనను ప్రలోభ పెట్టారని ఆయన న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

రేవంత్ రెడ్డి
తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి భారీ భద్రత మధ్య ఏసీబీ న్యాయస్థానానికి వస్తున్న దృశ్యం.

రేవంత్ రెడ్డి
తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి భారీ భద్రత మధ్య ఏసీబీ న్యాయస్థానానికి వస్తున్న దృశ్యం. న్యాయస్థానం రిమాండును జూలై 13వ తేదీ వరకు పొడిగించింది.

రేవంత్ రెడ్డి
తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి భారీ భద్రత మధ్య ఏసీబీ న్యాయస్థానానికి వస్తున్న దృశ్యం.

రేవంత్ రెడ్డి
తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి భారీ భద్రత మధ్య ఏసీబీ న్యాయస్థానానికి వస్తున్న దృశ్యం. రిమాండు పొడిగింపు అనంతరం తిరగి జైలుకు తరలించారు.

రేవంత్ రెడ్డి
తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి భారీ భద్రత మధ్య ఏసీబీ న్యాయస్థానానికి వస్తున్న దృశ్యం. రేవంత్ హావభావాలు.

రేవంత్ రెడ్డి
తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి భారీ భద్రత మధ్య ఏసీబీ న్యాయస్థానానికి వస్తున్న దృశ్యం. రేవంత్ హావభావాలు.
ఏసీబీ దాఖలు చేసిన మెమో పైన జరిగే విచారణలో దీనిని పరిగణలోకి తీసుకుంటామని న్యాయస్థానం తెలిపింది. కాగా న్యాయస్థానం ముగ్గురి రిమాండును జూలై 13వ తేదీ వరకు పొడిగించింది. కాగా, సండ్ర వెంకటవీరయ్యకు ఏసీబీ నోటీసుల గడువు నేటితో ముగియనుంది.
సండ్రను కూడా ఏసీబీ అధికారులు ఏక్షణమైనా అరెస్టు అవకాశం ఉందని అంటున్నారు. సండ్ర అరెస్టుకు రెండు ఏసీబీ బృందాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అవసరమైతే సండ్రకు మరో నోటీసు ఇచ్చేందుకు కూడా ఏసీబీ సిద్ధమవుతోందని సమాచారం. సండ్ర రాజమండ్రిలో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన అజ్ఞాతంలో ఉన్నారని అంటున్నారు. బాబు వాయిస్‌టెస్టుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి.












Click it and Unblock the Notifications