ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా: ఎసిబికి సండ్ర మరో లేఖ
హైదరాబాద్: ఓటుకు నోటు కేసును విచారిస్తున్న తెలగాణ ఎసిబికి ఖమ్మం జిల్లా శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య మరో లేఖ రాశారు. తాను విచారణకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానని ఆయన ఆ లేఖలో ఎసిబికి తెలియజేశారు. గతంలో ఎసిబి ఇచ్చిన నోటీసుకు సమాధానంగా తన ఆరోగ్యం బాగా లేనందున విచారణకు రాలేనని తెలియజేస్తూ లేఖ రాశారు.
విచారణకు హాజరు కావడానికి ఆయన అప్పుడు పది రోజుల గడువు అడిగారు. ఆ పది రోజుల గడువు ఎప్పుడో ముగిసింది. అయినా ఆయన విచారణకు హాజరు కాలేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. నోటుకు ఓటు కేసులో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఆయన బుధవారంనాడు ఎసిబికి లేఖ రాసినట్లు తెలుస్తోంది.

తాను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాయని, విచారణకు అందుబాటులో ఉంటానని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని ఆ లేఖలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సండ్ర వెంకట వీరయ్య ఎక్కడున్నాడనే విషయంపై గొత కొద్ది రోజులుగా విభిన్నమైన కథనలాు వస్తున్నాయి.
నోటుకు ఓటు కేసులో ఎసిబి రేవంత్ రెడ్డి సహా ఉదయ్ సింహ, సెబాస్టియన్‌లను అరెస్టు చేసింది. నాలుగో నిందితుడు మత్తయ్య ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఉన్నారు. దీంతో ఆయనన ఆరెస్టు చేయడానికి ఎసిబికి వీలు చిక్కడం లేదు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications