చీకోటీ కేసులో కొత్త మలుపు - రాజకీయ నేతలతో లింకులు : ఈడీ చిట్టాలో ఎవరెవరు..!!

కేసినో వ్యవహారంలో చీకోటీ విచారణలో కొత్త అంశాలను ఈడీ గుర్తించింది. చీకోటి నిర్వహించిన లావా దేవీల్లో భాగస్వాములు ఎవరనే అంశం పైన ఈడీ ఇప్పుడు ఆరా తీస్తోంది. చీకోటి నివాసంపైన ఈడీ దాడులు .. తరువాత విచారణ సమయంలో సేకరించిన ఆధారాలతో ఇప్పుడు ఆర్దిక సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించిన వారికి నోటీసులు ఇచ్చేందుకు సిద్దమైనట్లు సమాచారం. చికోటి ప్రవీణ్ తో జరిగిన వాట్సాప్ సంభాషలపైనా ఈడీ ఆరా తీస్తోందని తెలుస్తోంది. తెలంగాణలోని ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కు నోటీసులు రంగం సిద్ధం అయిందని చెబుతున్నారు.

ఈడీ సీక్రేట్ ఆపరేషన్

ఈడీ సీక్రేట్ ఆపరేషన్

ఇప్పటి వరకు చీకోటి విచారణలో ఈడీ అనేక అంశాల పైన సమాచారం సేకరించింది. థాయిలాండ్ ,మలేషియా, శ్రీలంకలో జరిగిన క్యాసినో వ్యవహారంలో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించిందని చెబుతున్నారు. ప్రముఖుల పేర్లు బయటకు వస్తుండటంతో..తనకు ప్రాణహాని ఉందని పోలీస్ బందోబస్తు కల్పించాలని చీకోటి ప్రవీణ్ హైకోర్టు లో రిట్ పిటిషన్ దాఖలు చేసారు. ప్రవీణ్ తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేతో సాగించిన వాట్సప్ సంభాషణల్ని ఈడీ గుర్తించింది.

రాజకీయ నేతలతో లింకులపై

రాజకీయ నేతలతో లింకులపై

వీటి సారాంశంపై లోతుగా విశ్లేషిస్తోంది. వీరితో ప్రవీణ్ ఏమైనా ఆర్దిక లావాదేవీలు నిర్వహించారా .. జరిగితే ఆ లావాదేవీల్లో మనీ లాండరింగ్ జరిగిందా అనే అంశాన్ని ఈడీ తేల్చేందుకు కసరత్తు చేస్తోంది. వాట్సాప్ చాటింగ్‌ను రీట్రైవ్ చేసే పనిలో ఉన్నారు. ఫొరెన్సిక్‌ ల్యాబ్‌లో శాస్త్రీయంగా విశ్లేషించడం ద్వారా... తొలగించిన సంభాషణలేమైనా ఉంటే రికవరీ చేసేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది. ఇందులో వెల్లడయ్యే అంశాల ఆధారంగానే మనీ లాండరింగ్ అంశం పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక, ఈ సమయంలోనే హైదరాబాద్ నగర శివార్లతో పాటుగా ఉమ్మడి కరీంనగర్.. నిజామాబాద్ జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులతోనూ సంబంధాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది.

మనీ లాండరింగ్ జరిగిందా అనే కోణంలో

మనీ లాండరింగ్ జరిగిందా అనే కోణంలో

అయితే, అవి ఆర్దిక పరమైన లావాదేవీలు ఏమైనా జరిగాయా లేదా..అనే కోణంలో ఇప్పుడు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 20 మంది వరకు చీకోటి నిర్వహించిన వాట్సాప్ లో ఛాటింగ్ లో ఉన్నట్లుగా సమాచారం. వీరికి ఈడీ నోటీసులు జారీ చేసి.. వారిని వరుసగా విచారించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు చీకోటీ వాట్సప్ లో ఉన్న ప్రముఖులు ఎవరనేది ఉత్కంఠతకు కారణమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+