కేసీఆర్ ఫ్యామిలీపై త్వరలోనే సీబీఐ, ఈడీ దాడులు: జైలుకే అంటూ బీజేపీ ఎంపీ అరవింద్ నిప్పులు
హైదరాబాద్: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రెండు రోజులుగా టీఆర్ఎస్ దొంగలు, గజదొంగ కేసీఆర్ చెప్పినట్లు పార్లమెంట్‌లో ప్రవర్తిస్తున్నారన్నారంటూ అరవింద్ దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

పన్ను తగ్గించమంటే.. ఆర్టీసీ ఛార్జీలు పెంచుతారట: ధర్మపురి అరవింద్
కేంద్రం పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గిస్తే.. రాష్ట్రప్రభుత్వం ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు ధర్మపురి అరవింద్. పైగా డీజిల్ ధరలు పెరిగినందుకు ఆర్టీసీ ఛార్జీలు పెంచుతామని ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతు ఉత్పత్తుల మీద టీఆర్ఎస్ నాయకులు స్మగ్లింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్లలో కేంద్రప్రభుత్వం 300 శాతం వరిధాన్యాన్ని సేకరిస్తుందన్నారు.

కేసీఆర్ జైలుకే.. త్వరలోనే ఈడీ, సీబీఐ దాడులు: అరవింద్
రైతులను మభ్యపెడుతున్న కేసీఆర్ ముందు టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చెయ్యాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ వాస్తవాలను దాచి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రజల సమస్యలు, రైతులు, నిరుద్యోగులు, ఆర్టీసీ ఛార్జీల ధరల పెంపుపై పోరాడతామన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. కేసీఆర్‌ను 100 శాతం జైలుకు పంపుతామని.. సీబీఐ, ఈడీ త్వరలో కేసీఆర్ కుటుంబంపై వచ్చిన ఆరోపణలపై విచారణ ప్రారంభిస్తాయన్నారు ఎంపీధర్మపురి అరవింద్.

టీఆర్ఎస్ నేతలపై కేసీఆర్‌కు నమ్మకం లేదన్న బాబు మోహన్
మరోవైపు, బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి బాబూమోహన్ కూడా సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సొంతపార్టీ ప్రజాప్రతినిధులే టీఆర్ఎస్కు ఎదురుతిరుగుతున్నారని, వాళ్లను కాపాడుకునేందుకు క్యాంపులకు తరలించి కాపలా కాస్తున్నారని ఎద్దేవా చేశారు. మెదక్ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ పరిధిలో టీఆర్ఎస్కు మెజారిటీ ఉన్నా క్యాంపులకు తరలించడమంటే వారిమీద నమ్మకం లేనట్టేనని అన్నారు. టీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన నేతలే ఆ పార్టీని నమ్మడం లేదంటే ప్రజలు, రైతులు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. అసంతృప్తివాదులంతా బీజేపీకి ఓటేస్తామని.. క్యాండిడేట్‌ను నిలబెట్టాలని సూచించారని, కానీ అధిష్టానం నిర్ణయం మేరకు పోటీకి దూరంగా ఉన్నట్టు చెప్పారు. వడ్ల కొనుగోలుకు సంబంధించి కేంద్రం పాలసీ క్లియర్‌గా ఉందని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం బురద జల్లుతోందని బాబు మోహన్ మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రైతులను వేధిస్తోందని, రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న టీఆర్ఎస్కు వారి ఉసురు తగులుతుందని దుయ్యబట్టారు. కేసీఆర్, ఆయన టీం మాట్లాడే భాష అనాగరికులు కూడా వాడరన్నారు. ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. వరి వేయొద్దంటున్న కేసీఆర్ లక్షల కోట్లు ఖర్చుపెట్టి ప్రాజెక్టులు ఎందుకు కట్టారని ప్రశ్నించారు.
Recommended Video

కేసీఆర్ ఎవరి పక్షయో తేలిపోయిందంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్
ఇది ఇలావుండగా, బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కేసీఆర్ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం కుట్రపూరితంగానే రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని ఆయన అన్నారు. వీఆర్వోలకు గత 14 నెలల నుంచి జాబ్ చార్ట్ ఇవ్వకుండా సతాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 15 రోజుల్లోనే ఇద్దరు వీఆర్ఏలు పే స్కేల్ కోసం ప్రాణాలు తీసుకున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు. వారికి రూ. 10,500 అరకొరగా జీతమిచ్చి.. గ్రామాలలో 30 రకాల పనులు చేయించుకోవడం నిలువు దోపిడి కాకపోతే మరేంటని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. మీరు రెండు సంవత్సరాల క్రితం చట్టంలో అనుభవదారుని కాలం ఏక పక్షంగా తీసేసి, ధరణి పోర్టల్ బలవంతంగా రుద్ది, కౌలు రైతులకు రైతుబంధు లేకుండా చేసి, అసైన్డ్ భూములను గుంజుకున్నపుడే మీరెవరి పక్షమో ప్రజలకు తెలిసిందని ఆర్ఎస్ ప్రవీణ్ విమర్శించారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications