ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ మరో అరెస్ట్..!!
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో అరెస్ట్ జరిగింది. హైదరాబాద్ కు చెందిన ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్ట్ చేసారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో అరెస్ట్ జరిగింది. హైదరాబాద్ కు చెందిన ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్ట్ చేసారు. రాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేసి సీబీఐ అధికారులు ఢిల్లీకి తరలించారు. ఈకేసులో 14వ నిందితుడిగా ఉన్న రామచంద్ర పిళ్లై కి చాటెడ్ అకౌంటెంట్‌గా గోరంట్ల బుచ్చిబాబు పని చేశారు.
గతంలో ఇదే కేసులో ఈడీతో పాటు సీబీఐ అధికారులు సోదాలు జరిపారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి హైదరాబాద్ కు చెందిన పలువురి పాత్ర పైన సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. కొందరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపింది. ఇప్పుడు బుచ్చిబాబు పైన వచ్చిన ఆరోపణలుతో ఆయన్ను సీబీఐ అరెస్ట్ చేసింది. అదే విధంగా తాజాగా గౌతమ్ మల్హోత్రాను ఈడీ అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది.

వచ్చాయి. ఈ కేసులో ఆప్ నేతల తరఫున సౌత్‌గ్రూప్ నుంచి రూ. 100 కోట్ల ముడుపులు సేకరించింది విజయ్ నాయరేనని ఈడీ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. సౌత్ గ్రూపులో పలువురి పేర్లు తెర మీదకు వచ్చాయి. ఆ గ్రూప్‌నకు అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు ప్రాతినిధ్యం వహించారు. కాగా.. నిన్న సీబీఐ అధికారులు బుచ్చిబాబును ప్రశ్నించారు. విచారణ తర్వాత రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
కాగా.. నేటి ఉదయం అధికారికంగా బుచ్చిబాబు అరెస్టును ప్రకటించారు. వైద్య పరీక్షల అనంతరం ఈ రోజు బుచ్చిబాబును రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచునున్నారు. ఈడీ అధికారులు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ లో ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేరును ప్రస్తావించారు. అంతేకాకుండా చార్జిషీట్‌లో వైసీపీ ఎంపీ మాగుంట పేరును కూడా చేర్చారు.

ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును ప్రస్తావించడంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. కానీ, కేజ్రీవాల్ తనపైన చేసిన అభియోగాలను ఖండించారు. రేపు లిక్కర్ స్కాం లో ఈడి అరెస్ట్ చేసిన నిందితుల బెయిల్ విచారణ కు రానుంది.
ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఈ అరెస్ట్ తో సీబీఐ తదుపరి అడుగుల పైన ఆసక్తి పెరుగుతోంది. అదే సమయంలో బుచ్చిబాబును సీబీఐ విచారణ కు కోరే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో చోటు చేసుకుంటున్న కొత్త పరిణామాలతో రాజకీయంగానూ చర్చ మొదలైంది. తాజాగా అరెస్ట్ చేసిన గౌతమ్ మల్హోత్రా కు ఒయాసిస్ గ్రూపులతో సంబంధాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications