16న సీఈసీ కౌంటింగ్ కేంద్రాల పరిశీలన..! ప్రతి సెగ్మెంట్‌లో ఐదు వీవీప్యాట్‌ల లెక్కింపన్న దానకిషోర్..!
హైదరాబాద్: పార్లమెంట్ స్థానాలకు జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఐదు వీవీప్యాట్లలోని స్లిప్‌లను లెక్కించనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ తెలిపారు. ఓట్ల లెక్కింపు పై సహాయ రిటర్నింగ్ అధికారులు, తహశీల్దార్‌లు, జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానం రిటర్నింగ్ అధికారి మాణిక్ రాజ్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ కెనడిలు హాజరైన ఈ సమావేశంలో దానకిషోర్ మాట్లాడుతూ, హైదరాబాద్ జిల్లాలోని కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను వెంటనే ప్రారంభించాలని తెలిపారు.

అంతే కాకుండా ఈ నెల 16వ తేదీన ఈవీఎంల స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం హైదరాబాద్ నగరానికి వస్తున్నారని తెలిపారు. కౌంటింగ్ లో పాల్గొనే సిబ్బంది, అధికారులకు 16వ తేదీన హరిహర కళాభవన్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు, 22వ తేదీన కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్‌తో పాటు మరో సారి శిక్షణ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా నియమ నిబంధనలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, కౌంటింగ్ సందర్భంగా ఏర్పడే సమస్యలను, పరిస్థితులను సంబంధిత అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులే పరిష్కరించేందుకు తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications