సిట్ దెబ్బకు వణికిపోతున్నారు: పూరి బాడీ లాంగ్వేజ్ అందుకే మారిపోయింది..

నిజానికి అక్కడికి వచ్చేదాకా..'ఏదో మేనేజ్ చేసేద్దాంలే అన్న ధీమానే' సినీ ప్రముఖుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

హైదరాబాద్: బయటపడొద్దు అని ఎంత కవర్ చేసుకున్నా.. ఒక్కసారి సిట్ గదిలో అడుగుపెట్టి, తిరిగి బయటకొచ్చేటప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ లోనే విషయం మొత్తం అర్థమైపోతోంది. లోపల విచారణ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో వారి ముఖంలోనే స్పష్టంగా కనిపిస్తుంది.

నిజానికి అక్కడికి వచ్చేదాకా..'ఏదో మేనేజ్ చేసేద్దాంలే అన్న ధీమానే' సినీ ప్రముఖుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. కానీ లోపలికెళ్తే గానీ విషయమంత ఆషామాషీ కాదన్న సంగతి వారికీ అర్థమవుతోంది. వెళ్లేదాకా ఎలాగోలా ఎదుర్కోవచ్చులే అని లోలోపల సర్దిచెప్పుకున్నా.. ఒక్కసారి సిట్‌తో సిట్టింగ్ లో కూర్చుకున్నాక.. వారి మైండ్ బ్లాంక్ అవక తప్పడం లేదు.

గంటల కొద్ది విచారణలో అధికారులు అడుగుతున్న ప్రశ్నలు సినీ ప్రముఖులు అసలు ఊహించలేకపోతున్నారు. పక్కా ఆధారాలతో సిట్ విచారిస్తున్న తీరు వారిని విస్మయానికి గురిచేస్తోంది. ఈ దెబ్బకు బాడీ లాంగ్వేజ్‌లో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మొన్న పూరి, నిన్న శ్యాం కె నాయుడు ఇదే తరహాలో బయటకొచ్చారు. లోపలికి వెళ్లేముందు ఒకలా.. బయటకొచ్చేముందు మరొకలా!..

celebrities body language was changed after sit interrogation

సిట్ విచారణ తర్వాత పూరిలో ఫ్రస్టేషన్ మొదలైందనేది మాత్రం క్లియర్‌గా అర్థమైంది. ట్విట్టర్‌లో ఆయన పోస్టు చేసిన వీడియోలో ఈ విషయాన్ని గమనించవచ్చు. మొదట.. తమకేమి తెలియదన్న విషయం దగ్గర మొదలుపెట్టి, సిట్ అధికారులు వారి వద్ద నుంచి ఎలా రాబట్టాలో అలా వివరాలు రాబడుతున్నారు. ఎన్నిసార్లు దాటవేసే ప్రయత్నం చేసినా.. సిట్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనై నిజాలు బయటపెట్టక తప్పని అనివార్య స్థితి వారిని వెంటాడుతోంది.

కాగా, టాలీవుడ్ డ్రగ్స్ కేసును పూరి & గ్యాంగ్.. తరుణ్ & గ్యాంగ్స్‌గా సిట్ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత పూరి గ్యాంగ్ ను విచారించి.. ఆ తర్వాత తరుణ్ గ్యాంగ్ లింకులు బయటపెట్టాలని చూస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+