కేంద్రం అదిరిపోయే శుభవార్త.. కేంద్రమంత్రి చేతులమీదుగా త్వరలోనే ప్రారంభం!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జాతీయ రహదారులతో పాటు, పలు ఫ్లైఓవర్ ల పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఎకనమిక్ కారిడార్లు, పర్యాటకాన్ని ప్రోత్సహించే వివిధ ప్రాజెక్టులు, రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసే వివిధ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 6280కోట్ల రూపాయలతో నిర్మించిన 285కిలోమీటర్ల జాతీయ రహదారులను, అంబర్ పేట ప్రాంతంలో నిర్మించిన ఫ్లైఓవర్ ను ప్రారంభించడానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రానున్నారు.

అంబర్ పేట ఫ్లైఓవర్ పై రాకపోకలు
మే 5వ తేదీన కేంద్ర రోడ్లు మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ఇవి ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని అంబర్ పేట ప్రాంతంలో నిర్మించిన ఫ్లైఓవర్ పనులు దాదాపు పూర్తి కాగా ఇప్పటికే రెండు నెలల నుంచి దీనిపైన రాకపోకలు సాగుతున్నాయి.

Center said great good news to Telangana with national highways and flyovers

కొనసాగుతున్న ఫ్లైఓవర్ కింద పనులు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో మహాశివరాత్రి పండుగ నుంచి అంబర్ పేట ఫ్లైఓవర్ పైన వాహనాల రాకపోకలకు అనుమతి లభించగా అప్పటినుండి వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే అంబర్ పేట ఫ్లైఓవర్ కింది భాగంలో కొన్ని పనులు ఇంకా పూర్తి కావలసి ఉంది. ఫ్లైఓవర్ కింద రోడ్డు నిర్మాణం, గ్రీనరీ, ఇతర సుందరీకరణ పనులు సాగుతున్నాయి.

Take a Poll

వర్చువల్ విధానంలో కేంద్రమంత్రి ప్రారంభం
హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా అంబర్ పేట ఫ్లైఓవర్ నిర్మించినట్టు, దీనివల్ల కాస్త ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఐదవ తేదీన స్థానిక మున్సిపల్ మైదానంలో సభ నిర్వహించడంతోపాటు అక్కడినుండే నగరంలో పూర్తయిన వివిధ ఫ్లై ఓవర్ బ్రిడ్జి లను వర్చువల్ విధానంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

ఫ్లై ఓవర్స్, నేషనల్ హైవేస్ పురోగతికి తార్కాణం
అలాగే 285 కిలోమీటర్ల జాతీయ రహదారులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 6280 కోట్ల రూపాయలతో నిర్మించిన జాతీయ రహదారులను, ఫ్లై ఓవర్లను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ప్రారంభించడం తెలంగాణ రాష్ట్రంలోని నేషనల్ హైవేస్ పురోగతికి తార్కాణంగా నిలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+