ఆ పని చేస్తున్నారా? నోటీసులు.. మీ రేషన్ కార్డులు రద్దు!

తెలంగాణలో రేషన్ కార్డుల దుర్వినియోగంపై రేవంత్ ప్రభుత్వం కఠిన చర్యలకు రెడీ అవుతోంది. అర్హత లేని అనేక మంది, ధనికులు సైతం రేషన్ కార్డులు కలిగి ఉన్నారని అధికారులు గుర్తించారు. త్వరలోనే ఈ అనర్హుల కార్డులను తొలగించే ప్రక్రియ ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఆదాయపు పన్ను చెల్లించే వారి కార్డులను రద్దు చేయటానికి కేంద్రం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో అనర్హుల రేషన్ కార్డులు రద్దు కానున్నాయి.

రేషన్ కార్డులపై కేంద్రం కీలక నిర్ణయం

ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారి కార్డులను రద్దు చేయడానికి కేంద్రం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. లబ్ధిదారుల ఆధార్, పాన్ వివరాలను ఆదాయపు పన్ను శాఖ సాయంతో పరిశీలించి, వారి ఆర్థిక స్థోమతను బట్టి కార్డులను తొలగించనున్నారు. ఖరీదైన వాహనాలున్న వారి రేషన్ కార్డులు కూడా ఈ క్రమంలో తీసివేస్తారు. అయితే రాష్ట్రంలో 83,545 మంది మరణించిన వ్యక్తుల పేర్లపై ఇప్పటికీ రేషన్ పంపిణీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.

Central Government Gears Up to Cancel 1 40 Lakh Cards Strict Action Against Ineligible Ration Cards in Telangana

ఆదాయపు పన్ను చెల్లించే వారికే కాదు, వీరికి రేషన్ కార్డు రద్దు

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డేటా ప్రకారం, 52,339 మంది లబ్ధిదారులు ఆదాయ పన్ను చెల్లిస్తున్నారని వెల్లడైంది.అంతేకాకుండా, 5,866 మందికి 15 ఎకరాలకు పైగా భూమి ఉండగా, రైతు భరోసా పథకం ద్వారా ఏటా రూ.1.50 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. తెలంగాణలో మొత్తం 1.05 కోట్ల రేషన్ కార్డులున్నాయి. వీటిలో 99.36 లక్షల ఆహార భద్రత కార్డులకు కేంద్రం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది.

రేషన్ పొందుతున్న వీరంతా అనర్హులు

లక్షలాది రూపాయల ఆదాయపు పన్ను చెల్లించే ధనికులు సైతం పేదలుగా ప్రస్తుతం ఉచిత బియ్యం పొందుతున్నారు. గత రెండేళ్లుగా ఈ మోసాలపై ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. రేషన్ కార్డుకు పట్టణాల్లో వార్షిక ఆదాయం రూ.2 లక్షలు, గ్రామాల్లో రూ.1.50 లక్షలలోపు ఉండాలనే నిబంధన ఉంది. అయితే, నెలకు లక్ష రూపాయల ఆదాయం ఉన్న కుటుంబాలు కూడా కార్డులను పొందుతున్నాయి.వీరంతా అనర్హులు.

రేషన్ పథకం లక్ష్యాన్ని దెబ్బ తీస్తున్న అక్రమార్కులు

నిరుపేదలకు అందాల్సిన బియ్యాన్ని ఈ అనర్హులు అక్రమంగా తీసుకోవడమే కాకుండా, వాటిని వినియోగించకుండా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని ఆరోపణలున్నాయి. ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చినప్పటికీ, అక్రమార్కులు పేదల ముసుగులో బియ్యాన్ని దారి మళ్లిస్తూ,ఈ రేషన్ పథకం లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, అనర్హుల రేషన్ కార్డులను రద్దు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో దాదాపు 1.40 లక్షల రేషన్ కార్డులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు.

త్వరలో నోటీసులు.. ఆపై కార్డులు రద్దు

కేంద్రం గుర్తించిన ఈ అనర్హుల జాబితా ఇప్పటికే తెలంగాణ పౌరసరఫరాల విభాగానికి చేరింది. నిబంధనలకు విరుద్ధంగా కార్డులు పొందిన వారికి నోటీసులు జారీ చేసి, అనంతరం వాటిని తొలగించనున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+