నేను ఏపీ-టీ నుంచి పోటీ చేయకపోయినా, అలా అన్లేదు: వెంకయ్య (పిక్చర్స్)

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం చెప్పారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి కేంద్రంలో ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశాన్ని అయినా ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

తాను తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహించకపోయినప్పటికీ తన దృష్టికి వచ్చిన ఏ సమస్య అయినా సంబంధిత మంత్రులతో చర్చించి పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల హైదరాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఏర్పడిన సమస్య సహా వివిధ అంశాలపై ఇలాంటి చొరవ తీసుకున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని బిజెపికి చెందిన మున్సిపల్ చైర్మన్లు, కార్పోరేటర్లు, కౌన్సిలర్ల సమావేశం ఆదివారం జరిగింది. దీనికి వెంకయ్య హాజయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రం ద్వారా తెలంగాణకు అందుతున్న తోడ్పాటు, నిధుల వివరాలను ప్రజాప్రతినిధులకు ఇస్తామన్నారు.

బిజెపి

బిజెపి

దేశ వ్యాప్తంగా అమృత్‌పథకం కింద పట్టణాల గుర్తింపు పూర్తయిందని వెంకయ్య నాయుడు చెప్పారు. అక్టోబర్ ఒకటో తేదీన అధికారికంగా వాటి జాబితా ప్రకటిస్తామన్నారు. దేశవ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాలు ఎంపిక చేశామన్నారు. అమృత్ పథకం కింద ఎంపికైన నగరాలు, పట్టణాలకు రూ.200 కోట్ల చొప్పున కేటాయిస్తామన్నారు.

బిజెపి

బిజెపి

అమృత్ పథకం కింద తెలంగాణలో 11 పట్టణాలను, ఏపీలో 31 పట్టణాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. మెదక్ జిల్లాలోని సిద్దిపేట పట్టణాన్ని ఇందులో చేర్చే అంశం కేంద్రం పరిశీలనలో ఉన్నదన్నారు. హైదరాబాద్, వరంగల్ నగరాలు స్మార్ట్‌సిటీలుగా ఎంపికయ్యాయని చెప్పారు. వరంగల్ సిటీని హెరిటేజ్ నగరంగా కేంద్రం గుర్తించిందన్నారు. ఈ మేరకు త్వరలోనే వరంగల్ నగర అభివృద్ధి పనులను ప్రారంభిస్తామన్నారు.

బిజెపి

బిజెపి

స్మార్ట్‌సిటీ, అమృత్ పథకాల కింద నగరాలు, పట్టణాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ఎంపిక చేశాయన్నారు. స్వచ్ఛ భారత్ కింద తెలంగాణకు రూ.403 కోట్లు ఇస్తున్నామన్నారు. రాష్ట్రప్రభుత్వాలు స్థానిక సంస్థలను పరిగణలోకి తీసుకొని అభివృద్ధిలో భాగస్వాములను చేయాలన్నారు.

 బిజెపి

బిజెపి

యూపీఏ ప్రభుత్వ హయాంలో రూ.8000కోట్లతో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాలేదని, వాటిని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

బిజెపి

బిజెపి

కేంద్రానికి అన్ని రాష్ర్టాలు సమానమేనని చెప్పారు. టీమిండియాలా పని చేయాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అభివృద్ధిలో రాష్ట్రప్రభుత్వాలను భాగస్వాములను చేయాలని ప్రధాని మోడీ కృషి చేస్తున్నారన్నారు. దేశ వ్యాప్తంగా రాజీవ్ ఆవాస్ యోజన కింద అసంపూర్తిగా నిలిచిపోయిన ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.

 బిజెపి

బిజెపి

తెలుగు ప్రజలకు తానే దిక్కని ఎప్పుడూ తాను అనలేదని చెప్పారు. ఇటీవల తాడేపల్లిగూడెంలో వెంకయ్య చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తానే దిక్కు అన్నానని వెంకయ్య చెప్పారని మండిపడ్డాయి. దీనిపై వెంకయ్య పైవిధంగా స్పందించారు.

బిజెపి

బిజెపి

తెలంగాణ ప్రజల ఆకాంక్ష... హైదరాబాదుతో కూడిన తెలంగాణ, ఆంధ్రా ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు తదితర అంశాలపై తాను ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో మాట్లాడాని చెప్పారు.

బిజెపి

బిజెపి

నాడు పార్లమెంటులో తలలు వంచుకొని సోనియా ముందు వినయంతో మౌనంగా ఉన్నవారు ఇప్పుడు ప్రధాని మోడీ మెడలు వంచుతానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. వికేంద్రీకరణ, రాష్ట్రాలకు అధికారాలు అనే విధానంతో టీమిండియాలా ముందుకు వెళ్లడం కేంద్రం లక్ష్యమన్నారు. రాష్ట్రాలు అలాగే ముందుకెళ్లాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+