RRR.. కేంద్రం గుడ్‌న్యూస్
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ పంపింది. హైదరాబాద్ ఉత్తర భాగం రీజినల్ రింగ్ రోడ్ (RRR) నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. సంగారెడ్డిలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి వరకు నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి ఈ టెండర్లు పిలిచింది. ఈ రహదారి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 5,555 కోట్లు ఖర్చు చేయనుంది.
ఈ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని కేంద్రం షరతు విధించింది. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ గ్రామం నుంచి రెడ్డిపల్లి గ్రామం వరకు 34.518 కిలోమీటర్లు, రెడ్డిపల్లి నుంచి ఇస్లాంపూర్ గ్రామం వరకు 26 కిలోమీటర్లు, ఇస్లాంపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్లు, సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి జిల్లా రాయగిరి వరకు 3 కిలోమీటర్లు ఇలా మొత్తం 161.5 కిలో మీటర్ల పొడవు రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది.

హైదరాబాద్ భాగం సంగారెడ్డి-తూప్రాన్-గజ్వేల్-చౌటుప్ప్ వరకు మొత్తం 161 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ మొత్తం భాగాన్ని ఆరు ప్యాకేజీల్లో నిర్మించనున్నారు. ఇందుకు 1940 హెక్టార్ల భూమి అవసరం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 72.35 హెక్టార్ల అటవీ భూమి కూడా ఉంది.
హైదరాబాద్ నగరాన్ని మరింత విస్తరించేందుకు, తెలంగాణ అభివృద్ధికి ఈ రీజినల్ రింగ్ రోడ్డు ఎంతగానో సహాయ పడనుంది. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు 40 కిలోమీటర్ల దూరం నుంచి ఈ ప్రతిపాదిత ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన విషయం తెలిసిందే.
రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలవడంపై తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు చేసిన కృషి ఫలించిందన్నారు. తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్తుకు రీజినల్ రింగ్ రోడ్డు బాటలు వేస్తుందన్నారు.
-
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications