రేషన్ సరఫరాలో కీలక మార్పులు- ఇక QR కోడ్, డిజిటల్ ఓచర్లతో..!!

రేషన్ సరఫరా వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఉచిత బియ్యం, ఇతర ఆహార ధాన్యాలను పంపిణీ చేసే విధానంలో మరో డిజిటల్ మార్పు తీసుకురా వాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కొత్తగా లబ్దిదారులకుప్రత్యేక డిజిటల్ వోచర్లు జారీ చేసి, వాటిని ఎస్ఎంఎస్ లేదా క్యూఆర్ కోడ్ రూపంలో ఉపయోగించే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.

రేషన్ సరఫరాలో కొత్త విధానం అమల్లోకి రానుంది. డిజిటల్ వ్యవస్థ పైన కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆధార్ అథెంటికేషన్, ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈపీఓఎస్) మెషిన్లు, వన్ నేషన్- వన్ రేషన్ కార్డ్ వంటి డిజిటల్ విధానాలను తీసుకొచ్చింది. అయితే రేషన్ సరుకులు పక్కదారి పట్టడాన్ని అరికట్టేందుకు డిజిటల్ వోచర్ సిస్టమ్ ప్రతిపాదనను కేంద్రం తీసుకురా నుంద ని తెలుస్తోంది. జనవరి 2026లో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూ షన్ పీడీఎస్ సిస్టమ్‌లో ఎన్‌పీసీఐ ఈ-రూపీ ప్లాట్‌ఫామ్‌ను అనుసంధానించడానికి సుదీర్ఘ కసరత్తు చేసింది. రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా అరికట్టడం, పంపిణీలో పారదర్శకత పెంచడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందు కోసం క్యూ ఆర్ కోడ్.. ఈ - రూపీ ఓచర్ అందుబాటులోకి తేవాలని కీలక ప్రతిపాదన చేసారు.

TTD గోల్డెన్ ఛాన్స్:రూ.5 చెల్లిస్తే 'సద్గమయ'లో నమోదు, ఫ్యామిలీతో శ్రీవారి దర్శనం..!!
TTD గోల్డెన్ ఛాన్స్:రూ.5 చెల్లిస్తే 'సద్గమయ'లో నమోదు, ఫ్యామిలీతో శ్రీవారి దర్శనం..!!
centre-plans-e-rupee-digital-vouchers-to-replace-ration-cards-to-distribute-commodities-details-her

తుది కసరత్తు

కేంద్రం ఇప్పటికే రేషన్ కార్డుల డిజిటలైజేషన్, ఆధార్ అనుసంధానం, బయోమెట్రిక్ ధృవీకరణ వంటి చర్యలు చేపట్టింది.అలాగే 'వన్ నేషన్-వన్ రేషన్ కార్డు' విధానం ద్వారా వలస కార్మికులు, ఇతర ప్రాంతాల్లో నివసించే అర్హులు తమకు అందుబాటులో ఉన్న రేషన్ దుకాణాల్లో సరుకులు పొందేందుకు అవకాశం కల్పించింది. ఇప్పుడు ఈ వ్యవస్థలో డిజిటల్ ఓచర్ల వినియోగం పైనా కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ పరిశీలిస్తోంది. అందులో భాగంగా లబ్దిదారుల అర్హత వివరాలను ఎస్బీఐకి పంపుతారు. ఎస్బీఐ, ఎన్‌పీసీఐ ఈ-రూపీ ప్లాట్‌ఫామ్‌తో కలిసి లబ్ధిదారుడి కోసం ప్రత్యేక వోచర్‌ను జనరేట్ చేస్తుంది. ఈ వోచర్ ఆధార్‌తో లింక్ అయిన లబ్ధిదారుడి వివరాలతో అనుసంధా నిస్తారు. వోచర్ జనరేట్ అయిన తర్వాత లబ్ధిదారుడి మొబైల్‌కు క్యూఆర్ కోడ్ రూపంలో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు మేరా రేషన్ యాప్ ద్వారా కూడా దీనిని యాక్సెస్ చేయటం ద్వారా సరుకులు పొందేలా విధానం పైన కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే ఈ విధానం పైన అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+