జిల్లాకు రూ.50 కోట్లు: కేంద్రం నుంచి తెలంగాణకు మరో రూ.450 కోట్లు విడుదల
తెలంగాణలో వెనుకబడిన 9 జిల్లాలకు కేంద్రం రూ.450 కోట్లు విడుదల చేసింది. ఇప్పటి వరకు మొత్తం 950 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది.
హైదరాబాద్: తెలంగాణలో వెనుకబడిన 9 జిల్లాలకు కేంద్రం రూ.450 కోట్లు విడుదల చేసింది. ఇప్పటి వరకు మొత్తం 950 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. రూ.50 కోట్ల చొప్పున 9 జిల్లలకు తాజాగా నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నిధులు విడుదల చేయాలి. ఈ మేరకు మరోసారి ఈ రోజు నిధులు విడుదల చేశారు.

అదిలాబాద్, నిజమాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు నిధులు విడుదలయ్యాయి. ఇప్పటి దాకా మొత్తం రూ.900 కోట్లు విడుదల చేసింది.












Click it and Unblock the Notifications