Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైతుబంధుపై ప్రతిపాదనేది రాలేదు: వికాస్ రాజ్, పార్టీలపై కేసులు, కీలక అంశాల వెల్లడి

హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల దాఖలు ప్రారంభమైందని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ (Vikas Raj) తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా చేసిన మార్పులు, ఎలాంటి నియమాలు పాటించాలో వివరించారు. రాజకీయ పార్టీలు ప్రజలకు ప్రలోభాలకు గురిచేయకుండా ఎన్నికల ప్రచారాన్ని చేయాలని సూచించారు.

శుక్రవారం వచ్చిన నోటిఫికేషన్‌తో నామినేషన్లు ప్రారంభమయ్యాయని, ఆదివారం మినహా మిగితా రోజుల్లో నామినేషన్లు స్వీకరిస్తారని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ దాఖలు చేయవచ్చని, అయితే, డిపాజిట్ మాత్రం ఒక్కదానికి చెల్లించాలని తెలిపారు. అభ్యర్థులు అఫిడవిట్‌లో అన్ని కాలమ్స్ తప్పనిసరిగా నింపాలని సీఈవో వికాస్ రాజ్ స్పష్టం చేశారు.

CEO Vikas Raj on Telangana Rythu Bandhu issue: key details of election process

నవంబర్ 30వ తేదీన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, మిగితా చోట్ల 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నవంబర్ 2వ తేదీ వరకు రాష్ట్రంలో 3 కోట్ల 21 లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారని తెలిపారు. అక్టోబర్ 31 వరకు వచ్చిన ఓటు హక్కు దరఖాస్తులను 10వ తేదీ వరకు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

మరోవైపు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు 362 కేసులు, 256 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు సీఈవో తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటి వరకు 137 కేసులు నమోదైనట్లు చెప్పారు. ఇందులో 13 బీఆర్ఎస్, 16 కాంగ్రెస్, 5 బీజేపీ, 3 బీఎస్పీ సంబంధిత కేసులు ఉన్నట్లు తెలిపారు. సీవిజిల్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 2,487 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రగతిభవన్‌కు సంబంధించి వచ్చిన ఫిర్యాదుల విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపినట్లు వికాస్ రాజ్ తెలిపారు.

నవంబర్ 10వ తేదీ తర్వాత ఓటర్ల అనుబంధ జాబితా ప్రకటించి ఆ తర్వాత ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు ముందుగానే పంపిణీ చేస్తామని వికాస్ ​రాజ్ తెలిపారు. 289 కేంద్రాల్లో ఓటర్లు 1500కు పైగా ఉన్నారని, ఓటర్ల అనుబంధ జాబితా తర్వాత కొన్ని పోలింగ్ కేంద్రాలు పెరుగుతాయని చెప్పారు. మొత్తం 205 చెక్ పోస్టులు ఉన్నాయని, ఇప్పటి వరకు రూ.453 కోట్లకు పైగా సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు సీఈవో తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదుకు ఆధారాలు ఉంటే జిల్లా కమిటీల ద్వారా త్వరగా విడుదల చేయాలని చెప్పామన్నారు.

వీలైనంత వరకు సామాన్యులకు ఇబ్బందులు లేకుండానే మార్గదర్శకాలు ఉన్నాయని సీఈవో తెలిపారు. ప్రలోభాలను కట్టడి చేయాలన్నదే ఈసీ ధ్యేయమని.. రెవెన్యూ ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఆయా విభాగాలు చర్యలు తీసుకుంటున్నాయని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. రైతుబంధు విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలేదని వికాస్ రాజ్ చెప్పారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి విషయంలో పోలీసుల నుంచి నివేదిక వచ్చిందన్నారు. అభ్యర్థుల భద్రతపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు వికాస్ ​రాజ్ తెలిపారు. ఆయనపై దాడి బాధాకరమన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+