కేబీఆర్ పార్క్: మహిళను కత్తితో బెదిరించిన చైన్ స్నాచర్ ఇతడే (ఫోటోలు)

హైదరాబాద్: నగరంలోని కేబీఆర్ పార్కులో పట్టపగలే మహిళపై బుధవారం దాడి జరిగిన సంగతి తెలిసిందే. మహిళకు కత్తి చూపించి బెదిరించిన దొంగను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

బుధవారం ఉదయం 9:30 ప్రాంతంలో ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉండే నవీన కేబీఆర్ పార్కులో వాకింగ్ ముగించుకొని వెళుతుండగా నందీనగర్‌లో నివాసం ఉండే పాత నేరస్థుడు సంతోష్ ఆమెను అడ్డగించి కత్తితో బెదిరించి ఆమెవద్ద ఉన్న ఆభరణాలు, సెల్‌ఫోన్ ఇవ్వాలని బెదిరించాడు.

ఆమె అందుకు నిరాకరించడంతో కోపంతో సంతోష్ ఆమె మెడలోని గొలుసును గట్టిగా పట్టుకొని లాగుతుండగా ఆమె ప్రతిఘటించి గొలుసును గట్టిగా పట్టుకుంది. దీంతో గొలుసు సగభాగం తెగిపోయింది. గొలుసు పూర్తిగా తనకు రాకపోవడంతో మరింత కోపంతో ఊగిపోయిన సంతోష్ నన్నే ప్రతిఘటిస్తావా అంటూ బెదిరించి ఆమె భుజంపై, మోచేతిపై కత్తితో దాడి చేశాడు.

ఈ క్రమంలో నవీన బిగ్గరగా కేకలు పెట్టింది. కేబిఆర్ పార్కు రోడ్డుపై వీధుల్లో ఉన్న ట్రాఫిక్ హోంగార్డు చంద్రశేఖర్ ఇది గమనించి పరుగున అక్కడికి చేరుకొని సంతోష్‌ను పట్టుకున్నాడు. అక్కడికి చేరుకున్న స్థానికులు సంతోష్‌కు దేహశుద్ధి చేశారు.

కేబీఆర్ పార్క్: మహిళను కత్తితో బెదిరించిన చైన్ స్నాచర్ ఇతడే

కేబీఆర్ పార్క్: మహిళను కత్తితో బెదిరించిన చైన్ స్నాచర్ ఇతడే

హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న బీట్‌ పోలీసులు నిందితుడిని అదుపులోనికి తీసుకొని బంజారాహిల్స్ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లో విచారణ జరపగా పాత నేరస్తుడు సంతోష్ అని కర్ణాటక రాష్ట్రానికి చెందిన సంతోష్ నందీనగర్‌లో నివాసం ఉంటూ దొంగతనాలకు పాల్పడుతుంటాడని తెలింది.

 కేబీఆర్ పార్క్: మహిళను కత్తితో బెదిరించిన చైన్ స్నాచర్ ఇతడే

కేబీఆర్ పార్క్: మహిళను కత్తితో బెదిరించిన చైన్ స్నాచర్ ఇతడే

గతంలో దొంగతనం కేసులో అరెస్టు అయిన సంతోష్ గతనెల 31నే విడుదలైనట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

 కేబీఆర్ పార్క్: మహిళను కత్తితో బెదిరించిన చైన్ స్నాచర్ ఇతడే

కేబీఆర్ పార్క్: మహిళను కత్తితో బెదిరించిన చైన్ స్నాచర్ ఇతడే

కాగా ఈ ఘటనలో గాయపడ్డ నవీనను అలోపో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన అనంతరం పంపించి వేశారు. బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు వద్ద మహిళను కత్తితో పొడిచి పారిపోయేందుకు యత్నించిన సంతోష్‌ను పట్టుకున్న ట్రాఫిక్ హోంగార్డు చంద్రశేఖర్‌ను డిసిపి చౌహాన్, ఎసిపి ముసామ్ బాషా అభినందించారు.

 కేబీఆర్ పార్క్: మహిళను కత్తితో బెదిరించిన చైన్ స్నాచర్ ఇతడే

కేబీఆర్ పార్క్: మహిళను కత్తితో బెదిరించిన చైన్ స్నాచర్ ఇతడే

అతనికి నగదు బహుమతిని అందించి సన్మానించారు. ట్రాఫిక్ విధుల్లో ఉంటూ మహిళ కేకలు వేసిన వెంటనే స్పందించి ఆమెను రక్షించడంతో పాటు దొంగను అరెస్టు చేసేందుకు చంద్రశేఖర్ ధైర్యసాహసాలతో వ్యవహరించాడని వారు ప్రశంసించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+