శుభాకాంక్షల వెల్లువ: కేసీఆర్‌కు చంద్రబాబు ఫోన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫోన్ చేశారు. రాష్ట్రపతి కోవింద్ శనివారం కేసీఆర్‌కు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.

చంద్రబాబు ఫోన్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. శనివారం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ఫోన్ చేసిన చంద్రబాబు ఫోన్‌లో జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోనూ కేసీఆర్ అభిమాన సంఘం పేరిట గుంటూరు జిల్లా తెనాలిలో ఖాదిర్ అనే వ్యక్తి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.
On his birthday, I convey my greetings to Telangana CM, KCR Garu. I pray for his wonderful health and long life. @TelanganaCMO
— Narendra Modi (@narendramodi) February 17, 2018
ప్రధాని శుభాకాంక్షలు
ప్రధాని నరేంద్ర మోడీ.. కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని మోడీ ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications