ఏది దూకుడు: రేవంత్ ఇష్యూలో చంద్రబాబు వెనకడుగు? కీలక వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: 'పార్టీ అనేక సంక్షోభాలు ఎదుర్కొంది' తెలంగాణ టిడిపి నేతలతో భేటీ సందర్భంగా ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. ఈ వ్యాఖ్యల్లో రేవంత్ రెడ్డి వెళ్లిపోయినా ఫర్వాలేదనే అర్థం వస్తుందని, మరోవైపు ఇప్పటికే పార్టీ చాలా ఇబ్బందులు పడిందని తెలంగాణ టిడిపి నేతలకు హెచ్చరికలు జారీ చేసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

బాబు రాక, క్లైమాక్స్‌కు రేవంత్ ఎపిసోడ్, టిడిపికి గుడ్‌బై! అధినేత నో చెప్తే మీడియా ఎదుటే షాక్

అదే సమయంలో రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తే విదేశాల్లో కనిపించినంత దూకుడు బాబులో కనిపించలేదని, రేపు అమరావతిలో ఏమైనా అనూహ్య, కీలక నిర్ణయం తీసుకుంటారా అనే చర్చ సాగుతోంది. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవనే సంకేతాలు పంపిస్తారా? రేవంత్ విషయంలో ఏం జరగనుందనేది ఆసక్తిగా మారింది.

ట్విస్ట్: నోరు విప్పని రేవంత్, మోత్కుపల్లికి షాక్, రేపు కీలక మీటింగ్

కానీ ఇవాళ్టికి మాత్రం చంద్రబాబు టిటిడిపి నేతలు ఆశించిన కీలక అడుగు మాత్రం వేయలేదని అంటున్నారు. అంటే ఆయన చర్యలు తీసుకోకపోయినప్పటికీ ఈరోజే గట్టి సంకేతాలు పంపిస్తారని భావించారు. కానీ అది జరగలేదని అంటున్నారు. దీంతో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారా అనే చర్చ సాగుతోంది.

అప్పటికే అన్ని వివరాలు ఆరా తీసిన చంద్రబాబు

అప్పటికే అన్ని వివరాలు ఆరా తీసిన చంద్రబాబు

శుక్రవారం ఉదయం లేక్ వ్యూ అతిథి గృహంలో చంద్రబాబుతో తొలుత తెలంగాణ టిడిపి చీఫ్ ఎల్ రమణ ఒక్కరే భేటీ అయ్యారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి అంశం గురించి పూర్తిగా చెప్పారు. అప్పటికే చంద్రబాబు తెలంగాణ టిడిపి నేతల ఇష్యూపై అప్పటికే ఆరా తీశారు. ఉదయం ఎల్ రమణ అన్ని వివరించారు.

చంద్రబాబు కీలక వ్యాఖ్యలపై చర్చ

చంద్రబాబు కీలక వ్యాఖ్యలపై చర్చ

ఆ తర్వాత తెలంగాణ టిడిపి నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. వారితో భేటీ కొనసాగుతుండగా రేవంత్ రెడ్డి వచ్చారు. అప్పటికే అన్ని విషయాలు తెలుసుకున్న చంద్రబాబు.. మోత్కుపల్లి వంటి నేతలు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేయగా వారించిన విషయం తెలిసిందే. అయితే, పార్టీ అనేక సంక్షోభాలు ఎదుర్కొందన్న చంద్రబాబు చేసిన కీలక వ్యాఖ్యలపై టిడిపిలో చర్చ సాగుతోంది.

రేవంత్ పైన చంద్రబాబు ఆచితూచి

రేవంత్ పైన చంద్రబాబు ఆచితూచి

భేటీ జరిగిన తీరును చూస్తుంటే రేవంత్ రెడ్డి తీరుతో పాటు ఇతర టిడిపి నేతల వైఖరి పైన కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఓ విధంగా రేవంత్ పైన చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

అందుకే రేవంత్ పట్ల కఠినంగా వ్యవహరించడం లేదా

అందుకే రేవంత్ పట్ల కఠినంగా వ్యవహరించడం లేదా


రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మానసికంగా సిద్ధమయ్యారని చంద్రబాబు సహా తెలంగాణ టిడిపి నేతలు అందరూ గుర్తించారు. అయితే తెలంగాణ టిడిపికి ఆయన కూడా ఓ కీలక నేత అని బాబు భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో టిడిపి పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. రేవంత్ వెళ్లిపోతే మరింత నిస్తేజం అవుతుంది. అందుకే రేవంత్ పైన చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారని, అందుకే ఆయన పట్ల కఠినంగా వ్యవహరించడానికి వెనుకడుగు వేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

పార్టీ నుంచి వెళ్లిపోతే చంద్రబాబు ఇలా

పార్టీ నుంచి వెళ్లిపోతే చంద్రబాబు ఇలా

టిడిపి ఓ యూనివర్సిటీ అని, పార్టీ నుంచి ఎవరు వెళ్లినా ఇబ్బంది లేదు అని గతంలో పలుమార్లు చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ అనేక సంక్షోభాలు ఎదుర్కొందని, అయినా టిడిపికి నష్టం ఉండదని ఆయన చెబుతుంటారు. పార్టీ నుంచి గతంలో వెళ్లిన సందర్భాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేసేవారు. కానీ ఇప్పుడు రేవంత్ విషయంలో ఆ మాటలు మరోలా స్ఫూరిస్తున్నాయని అంటున్నారు.

అనేక సంక్షోభాలు అన్నారు.. కానీ ఎవరిని ఉద్దేశించి

అనేక సంక్షోభాలు అన్నారు.. కానీ ఎవరిని ఉద్దేశించి


ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహారంలోను చంద్రబాబు అదే మాట మాట్లాడారు. పార్టీ అనేక సంక్షోభాలు ఎదుర్కొందని చెప్పారు. ఇది తెలంగాణ టిడిపి నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించి ఉంటారని భావిస్తున్నారు. కానీ రేవంత్ వెళ్లినా పార్టీకి ఎలాంటి నష్టం లేదనే ఉద్దేశ్యంతో మాత్రం అనలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రేవంత్ వ్యవహారంలో చంద్రబాబు ఆచితూచి

రేవంత్ వ్యవహారంలో చంద్రబాబు ఆచితూచి

ఎందుకంటే రేవంత్ పైన మోత్కుపల్లి, అరవింద్ కుమార్ గౌడ్ వంటి నేతలు ఫిర్యాదు చేయపోతే వారించారు. ఎల్ రమణ చెప్పింది సావదానంగా విన్నారు. రేవంత్ పైన కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని నేతలు చెప్పినా చంద్రబాబు ఆ మాటలను పక్కన పెట్టారు. అదే సమయంలో రేవంత్‌తో ఏకాంతంగా భేటీ అయ్యారు. సమయం లేకపోవడంతో రేపు అన్ని వివరాలు మాట్లాడేందుకు అమరావతికి రమ్మన్నారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

అదే దూకుడు ఉంటే రేవంత్‌పై చర్యలు తీసుకునే వారే కానీ

అదే దూకుడు ఉంటే రేవంత్‌పై చర్యలు తీసుకునే వారే కానీ


మరో ముఖ్యమైన విషయమేమంటే.. విదేశాల్లో ఉండగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, శాసన సభా పక్ష నేతగా రేవంత్‌ను చంద్రబాబు తొలగించారు. అదే దూకుడుతో వ్యవహరించాలనుకుంటే రేవంత్ రెడ్డి రాగానే వివరణ కోరి.. ఆ తర్వాత చర్యలకు ఉపక్రమించేవారు. కానీ శనివారం అమరావతిలో మరోసారి భేటీ అవుదామని చంద్రబాబు చెప్పారు. తద్వారా రేవంత్‌ను వదులుకునే ఉద్దేశ్యం చంద్రబాబుకు లేనట్లుగా కనిపిస్తోంది.

అంతకుముందు రాజీనామాపై జోరుగా ప్రచారం

అంతకుముందు రాజీనామాపై జోరుగా ప్రచారం

కాగా, ఉదయం చంద్రబాబుతో భేటీకి ముందు రేవంత్ రెడ్డి రాజీనామాపై జోరుగా ప్రచారం సాగింది. చంద్రబాబు అపాయింటుమెంట్ ఇవ్వడంతో.. ఆయనను కలిసి, వివరణ ఇచ్చిన అనంతరం రేవంత్ రెడ్డి ఆయనకు రాజీనామా ఇచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. కానీ పరిణామాలు చూస్తుంటే అటు చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తుండగా, రేవంత్ రెడ్డి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లుగా తెలుస్తోంది. టి-టిడిపి నేతలతో భేటీ సమయంలో కూడా ఆయన అందరిముందు చంద్రబాబు ముందు పెదవి విప్పలేదు. వారు వెళ్లాకనే అధినేతతో మాట్లాడారని తెలుస్తోంది.

చంద్రబాబు ఓ అడుగు వెనక్కి వేసినట్లేనా

చంద్రబాబు ఓ అడుగు వెనక్కి వేసినట్లేనా

రేవంత్ రెడ్డి ఏపీ టిడిపి నేతలపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరిటాల కుటుంబం, యనమల బంధువులు, పయ్యావుల కేశవ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారంటే రేవంత్ విషయంలో ఆయన ఏవిధంగా ఉన్నారో అర్థమవుతోందని అంటున్నారు. ఓ విధంగా రేవంత్ రెడ్డి అంత ఘాటుగా మాట్లాడినప్పటికీ ఆయన వెళ్లడం ఇష్టం లేదని చంద్రబాబు భావిస్తున్నారంటే.. ఓవిధంగా ఒకడుగు వెనక్కి వేసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఇందుకు తెలంగాణలో టిడిపి బతకాలంటే రేవంత్ వంటి నాయకుడు అవసరమని ఆయన భావిస్తున్నారా అనే చర్చ సాగుతోంది. లేదంటే ఓటుకు నోటు కేసు విషయమై ఆ సాహసం చేయలేకపోతున్నారా అనే చర్చ కూడా సాగుతోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu interesting comments in Telangana TDP meeting on friday. Strategic steps on Revanth Reddy issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి