చేసేవి తలకిందులు పనులు! నన్నే తిడతారా?: కెసిఆర్ సర్కారుపై బాబు ఫైర్(పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టులను వదిలేసి కొత్త ప్రాజెక్టులను కడతామంటూ ప్రకటనలు గుప్పించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణానదికి ఎగువనున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాజెక్టులు కట్టకుండా దిగువనున్న ఆంధ్రప్రదేశ్ ఎలా అడ్డుకోగలదని ప్రశ్నించారు. అంతేగాక అనవసరంగా తనను తిడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆదివారం హైదరాబాదుకు వచ్చిన చంద్రబాబు.. సోమవారం ఉదయం లేక్ వ్యూ అతిథి గృహంలో తెలంగాణ టిడిపి నేతలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏపీ సర్కారు పట్ల వ్యవహరిస్తున్న వింత వైఖరిని చంద్రబాబు తప్పుబట్టారు. తెలంగాణలో నిర్మాణంలో చాలా ప్రాజెక్టులున్నాయని, వాటిని పూర్తి చేసే విషయం పక్కనపెట్టి, కొత్తవి కడతామంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం హడావిడి చేస్తోందని అన్నారు. వాటికి ఏపీ ప్రభుత్వం అడ్డుపడుతోందంటూ నిందలేస్తోందని మండిపడ్డారు.
ఏ ప్రభుత్వం అయినా ముందు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుందని, దాని వల్ల రైతులకు త్వరగా నీరు అందుతుందని చెప్పారు. కానీ, తెలంగాణలో అందుకు వ్యతిరేకంగా వ్యవహారం నడుస్తోందని అన్నారు. ఈ తలకిందుల వ్యవహారం ఏంటని నిలదీశారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టుకుంటానంటే తాను వద్దన్నది లేదని, అడ్డు పడిందీ లేదని స్పష్టం చేశారు.
'ఉమ్మడి రాష్ట్ర విభజనలో వివిధ అంశాలపై మార్గదర్శకత్వానికి ఓ చట్టం తెచ్చారు. ఆ చట్టం చేసేటప్పుడు మనలను ఎవరూ అడగలేదు. ఆ చట్టంలోని నిబంధనల ప్రకారమే ఉభయ రాష్ట్రాలు వ్యవహరించాలని నేను కోరాను. కొత్త ప్రాజెక్టులు కట్టాలంటే ఏ నిబంధనలు అనుసరించాలో ఆ చట్టంలో ఉంది. దాని ప్రకారమే వెళ్లాలని సూచించాను' అని చంద్రబాబు తెలిపారు.
తనకు రెండు రాష్ట్రాలు సమానమేనని అన్నారు. టిఆర్ఎస్ పార్టీకి రాజకీయ ప్రయోజనం కావాలే తప్ప, ప్రజా ప్రయోజనం అవసరం లేదన్నారు. వాళ్లు అడిగిన వాటన్నింటికీ ఒప్పుకున్నట్లు తెలిపారు.
అయినా ఇంకేదో విషయం తీసుకుని తనను తిడుతూనే ఉంటారని, అలా రెచ్చగొడితేనే ప్రజల్లో వారికి పట్టు ఉంటుందన్నది వారి రాజకీయ కోణమని అన్నారు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు.. తెలంగాణ టిడిపి నేతలకు సూచించారు. ప్రజా సమస్యలపై సర్కారుతో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

చంద్రబాబు
తెలంగాణలో నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టులను వదిలేసి కొత్త ప్రాజెక్టులను కడతామంటూ ప్రకటనలు గుప్పించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు
కృష్ణానదికి ఎగువనున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాజెక్టులు కట్టకుండా దిగువనున్న ఆంధ్రప్రదేశ్ ఎలా అడ్డుకోగలదని ప్రశ్నించారు.

చంద్రబాబు
అంతేగాక అనవసరంగా తనను తిడుతూ రాజకీయ పబ్బం డుపుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆదివారం హైదరాబాదుకు వచ్చిన చంద్రబాబు.. సోమవారం ఉదయం లేక్ వ్యూ అతిథి గృహంలో తెలంగాణ టిడిపి నేతలతో సమావేశమయ్యారు.

చంద్రబాబు
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏపీ సర్కారు పట్ల వ్యవహరిస్తున్న వింత వైఖరిని చంద్రబాబు తప్పుబట్టారు. తెలంగాణలో నిర్మాణంలో చాలా ప్రాజెక్టులున్నాయని, వాటిని పూర్తి చేసే విషయం పక్కనపెట్టి, కొత్తవి కడతామంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం హడావిడి చేస్తోందని అన్నారు. వాటికి ఏపీ ప్రభుత్వం అడ్డుపడుతోందంటూ నిందలేస్తోందని మండిపడ్డారు.

చంద్రబాబు
ఏ ప్రభుత్వం అయినా ముందు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుందని, దాని వల్ల రైతులకు త్వరగా నీరు అందుతుందని చెప్పారు.
కానీ, తెలంగాణలో అందుకు వ్యతిరేకంగా వ్యవహారం నడుస్తోందని అన్నారు.

చంద్రబాబు
ఈ తలకిందుల వ్యవహారం ఏంటని నిలదీశారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టుకుంటానంటే తాను వద్దన్నది లేదని, అడ్డు పడిందీ లేదని స్పష్టం చేశారు.

చంద్రబాబు
ఈ సమావేశంలో టిడిపి తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ, ముఖ్య నేతలు రేవంత్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి , మోత్కుపల్లి నర్సింహులు, సీతక్క, విజయరమణారావు, వీరేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications