Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాలకృష్ణ రమ్మన్నా నో: హైద్రాబాద్‌లోని హోటల్లో ఉంటున్న బాబు ఫ్యామిలీ

హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం తన నివాసాన్ని ఫాంహౌస్ నుంచి హోటల్‌కు మార్చింది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని మదీనాగూడ వద్ద ఉన్న ఫాంహౌస్‌లో వీరు ఉంటున్నారు. శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌కు మారారు.

టిడిపి రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవనకు సమీపంలో ఉన్న పార్క్‌ హయత్‌లో పైన విడిగా కొన్ని ఫ్లాట్లు ఉన్నాయి. ఇంటి వాతావరణం మాదిరిగా ఉండి అందులో సొంతంగా వంట చేసుకొనే అవకాశముంది. ఈ కారణంగా చంద్రబాబు కుటుంబం ఈ హోటల్‌లోకి మారింది.

జూబ్లీ హిల్స్‌ చెక్‌పోస్టుకు సమీపంలోని చంద్రబాబు పాత ఇల్లు కూలగొట్టి కొత్త భవనం నిర్మిస్తున్నారు. ఆ ఇల్లు పూర్తి కావడానికి మరో రెండు నెలలు పడుతుందని తెలుస్తోంది. అది పూర్తయ్యే వరకు ఆయన కుటుంబం ఈ హోటల్లోనే ఉండనుంది.

చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రహ్మణి, మనవడు దేవాంశ్ ఇక్కడ ఉండనున్నారు. ఫాంహౌస్‌ నుంచి తిరగలేక ఇక్కడకు మారినట్లుగా తెలుస్తోంది. ఈ ఫాంహౌస్‌ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టుకు 16 కి.మీ. దూరంలో ఉంది.

అక్కడ నుంచి లోకేశ్ రోజూ పార్టీ కార్యాలయానికి వస్తుండగా, భువనేశ్వరి, బ్రహ్మణి పంజాగుట్టలోని హెరిటేజ్‌ ఆఫీస్‌కు వస్తున్నారు. వీరికి ఫాంహౌస్ నుంచి రావడానికి గంటలకొద్ది సమయం పడుతుంది. పైగా ఇంట్లోనే దేవాంశ్‌ను వదిలి రావాల్సి వస్తోంది.

Chandrababu Naidu Family Stayed in Park hyatt

దేవాంశ్‌ను మధ్యలో చూసుకోవడానికి ఇంటికి వచ్చేందుకు వీలు కావడం లేదు. సమయాన్ని వృథా చేసుకోకుండా ఉండేందుకు హోటల్‌కి మారారు. సొంత ఇల్లు కూలగొట్టి కొత్త భవనం నిర్మాణం చేపట్టిన తర్వాత చంద్రబాబు కుటుంబం మొదట జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడి సమీపంలో ఒక అద్దె భవనంలో ఉంది.

అక్కడి నుంచి నగర శివార్లలోని ఫాంహౌస్‌కు మారారు. చంద్రబాబు మధ్య మధ్యలో వచ్చి వెళ్తుండటంతో ఆయనను దృష్టిలో ఉంచుకొని ఫాంహౌస్‌లోనే కొంతకాలం ఉన్నారు. ఇప్పుడు హోటల్‌కి మారారు.

విజయవాడలో ఉంటున్న చంద్రబాబు ఎప్పుడైనా ఇక్కడకు వస్తే ఆ రోజు అందరూ కలిసి ఫాంహౌస్‌లో ఉండాలని, తర్వాత హోటల్‌కు వచ్చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. బ్రహ్మణి తండ్రి బాలకృష్ణ కూడా జూబ్లీహిల్స్‌లోనే ఉంటున్నారు. తమ ఇంటికి రావాలని ఆయన వారిని కోరారు.

కానీ బాలకృష్ణ ఇల్లు కూడా అంత పెద్దది కాదు. తామందరం వెళ్తే ఆయనకు ఇబ్బంది అవుతుందన్న అభిప్రాయంతో హోటల్లోనే ఉండాలని లోకేష్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. పార్క్‌ హయత్‌లో ఉన్న ఫ్లాట్లలో ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు ఉంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+