బాలకృష్ణ నిజమైన హీరో, అత్తగారి కోరిక మేరకు ఎన్టీఆర్ అలా: చంద్రబాబు
తన అత్తగారి కోరిక మేరకు ఎన్టీఆర్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభానికి పూనుకొన్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.
హైదరాబాద్: తన అత్తగారి కోరిక మేరకు ఎన్టీఆర్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభానికి పూనుకొన్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.
ఎన్టీఆర్ సతీమణి బసవతారకం క్యాన్సర్ తో బాధపడ్డారని చెప్పారు. అప్పట్లో ముంబాయి, చెన్నై నగరాలకు తీసుకెళ్ళి వైద్యం చేయించినా ఫలితం దక్కలేదన్నారు. బసవతారకం ఆసుపత్రి కోసం తనతోపాటు అనేకమంది ఎన్నారైలు, తెలుగు పెద్దలు సహకారం అందించారన్నారు.

ఈ రోజు బసవతారకం కేన్సర్ ఆసుపత్రిని చంద్రబాబు సందర్శించారు. ఆలపాటి రవీంద్రనాథ్, కళావతి దంపతుల పేరుతో పేద రోగుల విశ్రాంతి భవనాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఆలపాటి బాపన్న కృషితో ఈ విశ్రాంతి భవనం నిర్మాణం జరిగిందన్నారు. కూ. కోటిన్నర ఖర్చుతో 400 మందికి వసతి సౌకర్యం కల్పించేలా ఈ భవనాన్ని నిర్మించినట్టు చెప్పారు. బాలకృష్ణ అంకిత భావంతో ఆసుపత్రి అభివృద్దికి కృషి చేస్తున్నారని చెప్పారు.బాలకృష్ణ సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ పేదల ప్రాణాలు కాపాడే హీరో అని ఆయన కొనియాడారు.












Click it and Unblock the Notifications