ఎలావున్నారు? అసలేమైంది?: దేవేందర్‌ గౌడ్‌కు బాబు పరామర్శ

అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత దేవేందర్‌గౌడ్‌ను పరామర్శించారు. వేందర్‌గౌడ్‌ రాచెస్టర్‌లోని మేయో క్లినిక్‌లో క్యాన్సర్‌ చికిత్స పొందుతున

వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత దేవేందర్‌గౌడ్‌ను పరామర్శించారు. వేందర్‌గౌడ్‌ రాచెస్టర్‌లోని మేయో క్లినిక్‌లో క్యాన్సర్‌ చికిత్స పొందుతున్నారు.

దేవేందర్‌గౌడ్‌ను పరామర్శించిన చంద్రబాబు.. ఆయనకు అందిస్తున్న వైద్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. దేవేందర్ గౌడర్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని వైద్యులు డా. నాగేశ్వర్ రెడ్డి, డా. శాంతి స్వరూప్‌లు తెలిపారు.

chandrababu naidu visits Devender Goud house in America

గత కొంత కాలంగా ఆరోగ్య కారణాలరీత్యా దేవేందర్ గౌడ్ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నారు. ప్రస్తుతం అమెరికాలోనే దేవేందర్ గౌడ్ చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వంలో హోంమంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత కొంతకాలానికి పార్టీ వీడి సొంత పార్టీ(నవ తెలంగాణ) పెట్టారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అక్కడా కూడా ఉండలేక చివరకు తన సొంత పార్టీ తెలుగుదేశంలోనే అధినేత చంద్రబాబు సమక్షంలో చేరిపోయారు. కాగా, అమెరికాలో పర్యటిస్తు నేపథ్యంలో చంద్రబాబు.. దేవేందర్ గౌడ్‌ను కలిసి పరామర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+