రేవంత్‌రెడ్డికి ప్రాణహాని: హోంమంత్రి రాజ్‌నాథ్‌కు చంద్రబాబు లేఖ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ పార్టీ శాసనసభ పక్షనేత, తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డికి ప్రాణహాని ఉందని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌కు బుధవారం ఆయన లేఖ రాశారు.

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన పోరాడుతున్నారని, ఆయన ప్రాణానికి ఎప్పుడైనా ముప్పు కలగవచ్చని ఆ లేఖలో పేర్కొన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డికి అదనపు భద్రత కల్పించాలని, అదనపు భద్రత కోసం హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.

Chandrababu says tdp mla revanth reddy is having life threatening

దీంతో కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డికి అదనపు భద్రత కల్పించేలా తెలంగాణ ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసేలా జోక్యం చేసుకోవాలి ఆయన లేఖలో పేర్కొన్నారు. గతంలో వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణతో పాటు టీడీపీలో గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన ఎర్రబెల్లి దయాకర్‌రావుకు భద్రతను కుదించిన సంగతి తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh cheif minister Chandrababu Naidu says tdp mla revanth reddy is having life threatening. Because of this reason naidu wrote a letter to Home minister rajnath singh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి