కీలకంగా చండూర్, టౌన్ బీజేపీకే, గ్రామాలు మాత్రం కమ్యూనిస్టులు

మునుగోడు బై పోల్ ఫలితం ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. 9వ రౌండ్, 10వ రౌండ్ ఫలితం బట్టి గెలిచే పార్టీని అంచనా వేయొచ్చు. ఇప్పటివరకు అయితే టీఆర్ఎస్ పార్టీ 3 వేల పైచిలుకు ఓట్లతో లీడ్‌లో ఉంది. ఇక చండూరు మండలానికి సంబంధించిన ఓట్లు, 9వ రౌండ్.. 10వ రౌండ్‌లో లెక్కిస్తారు. ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలంగా ఉన్న.. గులాబీ పార్టీ కూడా ఆ మేరకు ప్రజలను ఆకట్టుకోగలిగింది.సో.. ఈ మండలాన్ని విజయాన్ని నిర్దేశించనుంది.

బీజేపీ ఆశలపై నీళ్లు..?

బీజేపీ ఆశలపై నీళ్లు..?

నిజానికి బీజేపీ చౌటుప్పల్, చండూర్ మీద ఆశలు పెట్టుకుంది. కానీ చౌటుప్పలు నీళ్లు చల్లింది. 5 నుంచి 6 వేల మెజార్టీ వస్తోందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుకున్నారు. కానీ కేవలం 500 ఓట్లే వచ్చాయి. ఇక్కడ అన్ని వృత్తుల వారు ఉండటం.. వారిని టీఆర్ఎస్ పార్టీ చక్కగా మేనేజ్ చేసింది. పథకాలు, అభివృధ్ది అని ఆ పార్టీ నేతలు జనంలోకి వెళ్లారు. వారిని విశ్వసించిన పరిస్థితి ఉంది. చండూరులో కమ్యునిస్టులకు కూడా పట్టు ఉండేది.బీజేపీకి నారాయణ పురంలో కూడా ఆశించిన ఓట్లు రాలేదు.

రాజగోపాల్ వెంట.. అయినా..?

రాజగోపాల్ వెంట.. అయినా..?

చండూరుకు చెందిన కాంగ్రెస్ నేతలు రాజగోపాల్ రెడ్డి వెంట బీజేపీతో నడిచారు. లీడర్ షిప్ క్యాష్ చేసుకున్నారు. మున్సిపాలిటీలో రాజగోపాల్ రెడ్డికి ఓటు బ్యాంక్ ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం లేదు. పుల్లెలం, సిద్దపెల్లి, నిర్మెట తదితర గ్రామాల్లో కమ్యునిస్టుల ప్రభావం ఉంది. ఆ ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి క్యాష్ చేసుకుంది. చండూర్, నాంపల్లి, మర్రిగూడెం మండలాలు విజయాన్ని ప్రభావితం చేయనున్నాయి. చండూరును దత్తత తీసుకుంటానని ప్రకటన కూడా టీఆర్ఎస్ పార్టీకి మేలు చేసింది.

15 వేల మెజార్టీ

15 వేల మెజార్టీ

ప్రస్తుత ట్రెండ్ చూస్తే టీఆర్ఎస్ పార్టీ 15 వేల మెజార్టీతో గెలుస్తోందని అంచనాలు వస్తున్నాయి. చండూరులో టీఆర్ఎస్ పార్టీకి వన్ సైడ్ ఓట్లు పడితే.. రాజగోపాల్ రెడ్డికి ఇబ్బందులు తప్పవు. ఇప్పటివరకు ఉన్న 3 వేల మెజార్టీ కాస్త.. పెరగనుంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు బై పోల్‌ను ప్రభావితం చేసి ఉంటాయి. అందుకే రాజగోపాల్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+