తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు: ఎప్పట్నుంచంటే?
హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్(ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రాన్స్ టెస్ట్) కౌన్సిలింగ్ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆగస్టు 14 నుంచి జరగాల్సిన ఐసెట్ కౌన్సెలింగ్‌ను వాయిదా వేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 6వ తేదీ నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 8 నుంచి 12వ తేదీ వరకు అభ్యర్థుల ధృవపత్రాలను పరిశీలించనున్నారు. సెప్టెంబర్ 8 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి సమయం ఇచ్చారు. సెప్టెంబర్ 17వ తేదీన ఎంబీఏ, ఎంసీఏ తొలి విడత సీట్లను కేటాయించనున్నారు.

సెప్టెంబర్ 22 నుంచి ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 28న ఎంబీఏ, ఎంసీఏ తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబర్ 29న స్వాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు కాకతీయ వర్సిటీ ఒక ప్రకటలో వెల్లడించింది. మరోవైపు, కన్వీనర్ కోటాలో ఇంజినీరింగ్ సీటు పొందిన అభ్యర్థులు కాలేజీల్లో రిపోర్టు చేసేందుకు గడువు శనివారంతో ముగియాల్సి ఉండగా.. దాన్ని ఆదివారం వరకు పొడిగించినట్లు కన్వీనర్ తెలిపారు.
కాగా, 2023 ఫిబ్రవరి 28న ఐసెట్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 2023- 24 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ వృత్తి విద్యా కోర్సులకి దరఖాస్తులు పెట్టుకోవాలని ప్రకటన జారీ చేసింది. అనంతరం మే 26, 27 తేదీల్లో ఐసెట్ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది. 70,900 మంది అభ్యర్థులు ఈ పరీక్షను రాశారు. జూన్ 29న ఈ పరీక్ష ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో 86.17 శాతం ఉత్తీర్ణత అవ్వగా.. 61,092 మంది అర్హత సాధించారని అధికారులు తెలిపారు. ఇందులో తొలి పది ర్యాంకుల్లో అబ్బాయిలే ఉన్నారు. నూకర్ శరణ్ కుమార్ తొలి ర్యాంక్ సాధించాడు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది












Click it and Unblock the Notifications