సేవ పేరుతో దందా; సన్మానాల పేరుతో వసూళ్లు: దొరికితేనే దొంగలు!!

సేవ పేరుతో దందాలు చేస్తున్నవారు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. నిజంగా సామాజిక సేవ కంటే, వసూళ్లే వారి లక్ష్యంగా పలు స్వచ్ఛంద సేవా సంస్థలను స్థాపిస్తున్నారు. పలు సేవా సమితుల పేరుతో ఇబ్బడిముబ్బడిగా జనాలను దోచుకుంటున్నారు. నిస్సహాయంగా ఉన్న వారికి సహాయం చేస్తామని సమాజంలోని పలువురు పెద్దల వద్దకు వెళ్లి డబ్బులు తీసుకుని కొత్తరకం మోసాలకు తెర తీస్తున్నారు.

సన్మానాల పేరుతో డబ్బులు వసూలు చేస్తూ సేవ అనే పదానికి మాయని మచ్చ తెస్తున్నారు.తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ తో పాటు, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ సహా అనేక జిల్లాలో సోషల్ సర్వీస్ పేరుతో దందా జోరుగా సాగుతోంది. విభిన్న రంగాలలో పనిచేసే పలువురిని తమ సేవా సమితి పేరుతో సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆహ్వానిస్తూ, ఒక్కొక్కరి వద్ద నుండి 5000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు.

charitable organizations cheating in the name of service; Collecting money for awards functions!!

ఇక ఈ కార్యక్రమాలకు మంత్రులను, ఎమ్మెల్యేలను పిలిచి వారితో కలిసి ఫోటోలు దిగి, ఆ తర్వాత ఆ ఫోటోలను తిరిగి దందా కోసం ఉపయోగించుకుంటున్నారు. వివిధ సేవా సమితులు ఏర్పాటు చేసిన వారి బ్యాక్ గ్రౌండ్ చూస్తే వారంతా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు. చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారు.

సేవా సమితి పేరుతో సమాజంలోని వ్యాపారవేత్తలను, రాజకీయ నాయకులను కలుస్తూ, నిజంగా సేవ చేయాలనే దృక్పథం ఉన్న వారి నుండి డబ్బులు వసూలు చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. అంతేకాదు ఎవరికైనా అవార్డులు తీసుకోవాలని, సన్మానాలు చేయించుకోవాలని ఆలోచన ఉంటే వారి వద్ద నుండి దండిగానే డబ్బులు వసూలుచేసి దందా చేస్తున్నారు. ఇక వీరు నిర్వహించే సేవాసమితి లకు సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్లు ఉండవు.

ఒక బ్యాంక్ ఎకౌంట్ కానీ, కనీసం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం కానీ ఏది ఉండదు. నకిలీ రిసిప్ట్ బుక్ లు పెట్టి వారి స్వచ్ఛంద సేవా సంస్థకు డబ్బులు విరాళంగా ఇచ్చిన వారికి రిసిప్ట్ లుఇస్తున్నారు. ఇటువంటి స్వచ్ఛంద సంస్థల పైన, సేవా సమితుల పైన పోలీసుల నిఘా లేకపోవడంతో ఇలాంటి నకిలీ సేవా సంస్థలు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తున్నాయి.

తాజాగా నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సేవా సమితి పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న ఒక ముఠాను అరెస్ట్ చేశారు. మంత్రుల ఫోటోలు ముద్రించి వసూళ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుండి నకిలీ రిసిప్ట్ బుక్కులను, 4 ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు.

పేరాల వెంకటేష్, గడ్డమీది రాజేష్ కుమార్ లు ఈ దందా చేస్తున్నట్టు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక ఇటువంటి అనేక స్వచ్ఛంద సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయని, వాటిపైన కూడా దృష్టి సారించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+