కెల్విన్‌తో చార్మికి సన్నిహిత సంబంధాలు, వారికి భిన్నంగా విచారణ
డ్రగ్స్ కేసులో నటి చార్మి పాత్ర ప్రత్యేకమని సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) అధికారులు భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ కేసులో అరెస్టయిన డ్రగ్ సప్లయర్ కెల్విన్‌తో చార్మీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సిట్
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో నటి చార్మి పాత్ర ప్రత్యేకమని సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) అధికారులు భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ కేసులో అరెస్టయిన డ్రగ్ సప్లయర్ కెల్విన్‌తో చార్మీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సిట్ గుర్తించిందని వార్తలు వస్తున్నాయి.
తన విచారణలో కెల్విన్ కీలక విషయాలు చెప్పాడని తెలుస్తోంది. ఇందులో భాగంగా అతను అప్పుడు చార్మి గురించి చెప్పిన విషయాలు విని అధికారులే ఆశ్చర్యపోయారని తెలుస్తోంది. కెల్విన్ ఫోన్లో చార్మికి సంబంధించిన చాలా సమాచారం ఉందంటున్నారు.

మరింత సమాచారం దొరికేదాకా
చార్మీని సాక్షిగా పిలిచామని, ఆమెను నిందితురాలు అని తాము అనలేదని సిట్ అధికారులు హైకోర్టుకు చెప్పారు. కెల్విన్‌తో ఆమె చాలాసార్లు వాట్సాప్ చాట్ చేయడం, ఫోన్ కాల్స్ ఉన్న నేపథ్యంలో వాటన్నింటిని దగ్గర పెట్టుకొని అధికారులు ఆమెను విచారించారు. ఆధారాలు చూపించి మరీ ఆమెను బుధవారం ప్రశ్నించారు. అయితే, మరింత పక్కా సమాచారం లేదా ఆధారాలు దొరికే వరకు ఆమెను సాక్షిగానే చూడనున్నారని తెలుస్తోంది.

మరోసారి అందుకే
సినీ తారలను విచారించిన అనంతరం అధికారులు కెల్విన్ అండ్ గ్యాంగ్‌ను మరోసారి తమ కస్టడీకి తీసుకోనున్నారని తెలుస్తోంది. అంతకుముందు వారు చెప్పిన సమాచారంతో సినీ తారలను ప్రశ్నించారు. ఇప్పుడు వీరు ఇచ్చిన సమాచారంతో మరోసారి కెల్విన్‌ను ప్రశ్నించి, మరికొంత సమాచారం రాబట్టే ప్రయత్నం చేయనున్నారని తెలుస్తోంది. అందుకే, చార్మీ, తరుణ్ వంటి వారిని పిలిస్తే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పారు.

వారికి భిన్నంగా విచారణ
మిగతా వారికి భిన్నంగా చార్మీ విచారణ ప్రారంభించారని తెలుస్తోంది. వ్యక్తిగత విషయాలు అడగవద్దని ఆమె చెప్పింది. ఎవరి నుంచి అయినా అన్ని విషయాలు కూపీ లాగేందుకు పోలీసులు వివిధ రకాలుగా ప్రశ్నిస్తారు. ఇందులో భాగంగానే పూరీ, తరుణ్, సుబ్బరాజు తదితరులను ఎన్నో విషయాలు అడిగారు. అయితే, చార్మీని విచారణ మిగిలిన వారికి భిన్నంగా ప్రారంభించారని సమాచారం.

ఆ సమయంలో తొట్రుపాటు
డ్రగ్ ముఠాతో ఛార్మికి సంబంధాలు ఉన్నట్లు సిట్ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, దీంతో ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా నేరుగా అధికారులు.. కెల్విన్, డ్రగ్ ముఠా, పబ్బుల గురించి ప్రశ్నించారని సమాచారం. ఆధారాలు ముందు పెట్టినప్పుడు ఆమె కాస్త గందరగోళానికి గురయ్యారని సమాచారం. అయినప్పటికీ తనకు సంబంధం లేదని చెప్పారని తెలుస్తోంది.

ఆందోళన లేకుండా చార్మీ, ముమైత్
డ్రగ్ కేసులో చార్మీ, ముమైత్ ఖాన్‌లు బుధ, గురువారాలు సిట్ ఎదుట హాజరయ్యారు. ఇరువురు కూడా నిబ్బరంగా సిట్ కార్యాలయంలోకి వెళ్లారు. అలాగే, వచ్చేటప్పుడు చార్మీ నవ్వుతూ బయటకు వచ్చారు. ముమైత్ ఖాన్ మొహంలోను ఆందోళన కనిపించలేదు. కాగా, చార్మీ సిట్ కార్యాలయానికి వచ్చినప్పుడు ఓ పోలీస్ అత్యత్సాహం ప్రదర్శించారు. దీంతో ముమైత్ ఖాన్ వచ్చినప్పుడు అక్కడ మహిళా పోలీసులు తప్ప మరెవరూ లేకుండా సిట్ జాగ్రత్తలు తీసుకుంది.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications