రాష్ట్ర చిహ్నంలో చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగింపు.. బీఆర్ఎస్ ధర్నాలో కేటీఆర్, మొదలైన రచ్చ

తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని మార్చడంపైన ప్రస్తుతం తెలంగాణాలో రగడ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం నుండి చారిత్రక చిహ్నాలు అయిన చార్మినార్ ను, కాకతీయ కళాతోరణాన్ని తొలగించడం పైన బిఆర్ఎస్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర చిహ్నంలో నుండి చార్మినార్, కాకతీయ కళా తోరణాన్ని తొలగించడంపై ఆందోళనలకు శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్.

రాచరికపు గుర్తులను చెరిపేస్తూ తెలంగాణా రాష్ట్ర కొత్త లోగో
ఓవైపు తెలంగాణ ప్రభుత్వం అమరవీరుల పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నం ఉంటుందని ప్రస్తుతం రాష్ట్ర చిహ్నంలో ఉన్న రాచరికపు గుర్తులను చెరిపేస్తూ, ప్రజాస్వామ్యాన్ని, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కొత్త లోగోను తయారు చేయడానికి ప్రభుత్వం కంకణబద్ధమై ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నం తుది రూపుదిద్దుకుంది.

Charminar Kakatiya Kalathoranam removal in state emblem controversy KTR in BRS dharna

చార్మినార్ వద్ద బీఆర్ఎస్ నిరసనలో కేటీఆర్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ఈ నూతన చిహ్నాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ రాష్ట్ర చిహ్నంలో నుంచి చార్మినార్ ను, కాకతీయ కళా తోరణాన్ని తొలగించడం పై భగ్గుమంటుంది. ఈ క్రమంలో చార్మినార్ వద్ద నేడు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొంటున్నారు.

శతాబ్దాలుగా హైదరాబాద్ కు ప్రతిరూపంగా చార్మినార్
తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం నుంచి చార్మినార్ ను తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నేడు ఆయన దీనిపై ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభుత్వ చర్యను తప్పు పట్టిన ఆయన శతాబ్దాలుగా హైదరాబాద్ కు ప్రతిరూపంగా హైదరాబాద్ కీర్తికి గుర్తుగా చార్మినార్ కొనసాగుతుందని తన పోస్టులో వెల్లడించారు.

రాష్ట్ర లోగో నుండి చార్మినార్ తొలగింపు .. ఎంత సిగ్గుచేటు
హైదరాబాద్ గురించి ఎవరైనా తలుచుకుంటే చార్మినార్ ని గుర్తు చేసుకోక తప్పదని, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందే అన్ని లక్షణాలు ఈ చారిత్రక నిర్మాణానికి ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పనికిమాలిన కారణాలను సాకుగా చూపించి చార్మినార్ చిహ్నాన్ని రాష్ట్ర లోగో నుంచి తొలగించాలని చూస్తోంది ఎంత సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో రచ్చేనా?
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని కేటీఆర్ తన పోస్టు ద్వారా తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం పైన, జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతం పైన రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణుల నుండి నిరసనలు వ్యక్తం అవుతున్న వేళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ వ్యవహారంలో రచ్చ కొనసాగుతుంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+