మొహానికి మాస్క్ పెట్టుకోమన్నాడు.!మంగళసూత్రం కొట్టేసాడు.!మాస్క్ మాటున మాయగాడు.!
హైదరాబాద్ : మోసాలకు కాదేదీ అనర్హం అన్నట్టు తయారయ్యాయి రోజులు. జనాలను బురిడీ కొట్టించడమన్నా, అడ్డంగా మోసం చేయాలన్నా కేటుగాళ్లు కొత్త కొత్త మార్గాలను అణ్వేషిస్తున్నారు. అంతే కాకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలను కూడా మోసాలకు అన్వయించుకుని అనుమానం రాకుండా అడ్డంగా దోచుకుంటున్నారు మోసగాళ్లు. తాజాగా కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు గడగడలాడుతన్న సమయంలో ఈ భయంకర పరిస్థితుల్లో ఎదుటి వారిని మోసం చేయడం ఎలా అనే అంశంపై రీసెర్చ్ చేసి మరీ అమాయకులను టార్గెట్ చేస్తున్నారు మోసగాళ్లు. చూడడానికి ఉన్నత చదువులు చదువుకున్న వారిలా మంచి డ్రెస్ వేసుకోవడం, ఏమాత్రం అనుమానం రాకుండా షూ, టై కట్టుకుని సాఫ్ట్ వేర్ ఆఫీస్ కు వెళ్తున్న మాదిరి మోసాలకు బయల్దేరుతున్నారు యెదవవన్నర యెదవలు.
తాజాగా కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు వాడే మాస్కును చూపించి మోసం చేసిన ఉదంతం యావత్ ప్రజానికాన్ని విస్మయానికి గురిచేస్తోంది.
Recommended Video

అమాయకపు లుక్కు, బక్కపలచని శరీరాకృతి, నీట్ గా వేసుకున్నడ్రెస్ తో పాటు కాళ్లకు షూస్. ఎవరో ఉద్యోగం చేసుకునే వాడి గురించి బాగా వర్ఱిస్తున్నారు అనుకుంటున్నారా..? ఐతే కోవిడ్ కాలుతో తన్నినట్టే అవుతుంది. ఇదంతా ఎదుటి వారిని పచ్చిగా మోసం చేసేందుకే. ఫలానా కంపెనీ గురించి వచ్చాం మేడం.. కరోనా బారిన పడకుండా మా కంపెనీ నాణ్యమైన మాస్కులను తయారు చేసింది. ఒక్కసారి పెట్టుకొని చూడండి మేడం. అంతగా సరిపోకపోయినా, ఇబ్బందిగా అనిపించినా చెప్పండి మేడం.. పైగా ఈ మాస్కులను కంపెనీ ప్రమోషన్ లో భాగంగా ఉచితంగా అందిస్తున్నాం మేడం, దయచేసి ఒక్కసారి ధరించి చూడండి. అంటూ ఓ మాస్క్ తీసి ఒంటిరిగా ఉన్న గృహిణులకు అంటగడుతున్నాడు ఈ కేటుగాడు. ఐతే మాస్క్ లో అంతకు ముందే వేసిన మత్తు మందువల్ల అది పెట్టుకోగానే కొన్ని సెకండ్లలో మహిళలు స్పృహతప్పి పడిపోతారు. వెంటనే మోసగాడు సదరు మహిళ మెడలోని మంగళసూత్రాన్ని క్షణంలో మాయమవుతాడు. ఇదీ ప్రస్తుతం కరోనాను అడ్డం పెట్టుకుని అడ్డంగా చేస్తున్న మోసం. ఆ వీడియో మీరూ చూడండి.












Click it and Unblock the Notifications