సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై
వేసవిలో ప్రయాణికుల అదనపు రద్దీని నియంత్రించేందుకు రైల్వే అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ మార్గాల్లో నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు కోచ్‌లను జోడించనున్నట్లు వెల్లడించారు. ఇది తాత్కాలికమే. ఈ కోచ్‌ల పెంపు ఈ నెల చివరి వారం నుండి మే/జూన్ వరకు అమల్లో ఉంటుంది. ప్రయాణికులకు అదనపు సౌకర్యాన్ని కల్పించినట్టవుతుంది.
డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- తిరుపతి మధ్య తిరిగే 16053/16054, 16057/16058 సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లకు ఒక్కో చైర్ కార్ కోచ్‌ను తాత్కాలికంగా జతచేస్తారు. చెన్నై, తిరుపతి నుండి మార్చి 30 నుండి జూన్ 2వ తేదీ వరకు ఈ అదనపు కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

- కోచ్‌ల పెంపు తర్వాత, వాటి కూర్పు పెరుగుతుంది. చైర్ కార్- 11, జనరల్ సెకండ్ క్లాస్- 4, దివ్యాంగులకు అనుకూల సెకండ్ క్లాస్ కోచ్- 1, లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్- 1 జత అవుతాయి.
12603/12604 డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - చర్లపల్లి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను అదనంగా జత చేయనున్నారు. చెన్నై నుండి చర్లపల్లికి అదనపు బోగీలను ఏర్పాటు చేసిన సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఈ నెల 30 నుండి జూన్ 2వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. అలాగే చర్లపల్లి- చెన్నై ఎక్స్ ప్రెస్ కు ఈ నెల 31 నుండి జూన్ 3వ తేదీ వరకు ఈ సదుపాయం ఉంటుంది.
- పెంపు తర్వాత వాటి కూర్పు మారుతుంది. ఒక ఏసీ ఫస్ట్ క్లాస్ కమ్ ఏసీ టూ టైర్, రెండు ఏసీ టూ టైర్, మూడు ఏసీ త్రీ టైర్, పన్నెండు స్లీపర్ క్లాస్, నాలుగు సాధారణ సెకండ్ క్లాస్, ఒక దివ్యాంగులకు అనుకూల సెకండ్ క్లాస్ కోచ్, ఒక లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్ ఉంటాయని రైల్వే ప్రకటించింది. ఇవి తప్ప ఆయా రైళ్ల సమయాల్లో ఎటువంటి మార్పులూ చోటు చేసుకోలేదు.
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications