నాన్ వెజ్ ప్రియులకు బిగ్ షాక్.. చికెన్, కోడిగుడ్ల ధరలు చూస్తే..
నాన్ వెజ్ ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి చికెన్, కోడిగుడ్లు ధరలు 25-30 శాతం పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాల అంచనా వేస్తోంది. ఎల్ నినో ప్రభావంతో కోళ్ల మేత ధరలు పెరగడం, పండుగల సీజన్ లో డిమాండ్ అధికం కావడమే ధరల పెరుగుదలకు కారణమని సమాచారం అందుతోంది. అలాగే పౌల్ట్రీ ఉత్పత్తి 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉండటంతో సామాన్యులపై మరింత ఆర్థిక భారం పడనున్నట్లు తెలుస్తోంది. ఇక క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నాటికి మరింత భారీగా చికెన్ ధరలు పెరగే అవకాశం ఉండడంతో సామాన్య ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
నవంబర్ 14 నాటికి చికెన్ ధరలు ఓసారి చూస్తే.. హైదరాబాద్ లో కిలో స్కిన్ లెస్ చికెన్ ధర రూ.252 వద్ద కొనసాగుతోంది. అలాగే డ్రస్స్‌డ్ చికెన్ రూ.223గా ఉంది. ఇక రిటైల్ లైవ్ బర్డ్ ధర రూ.144 గా ఉంది. అలాగే ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ ధర రూ.117 గా ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో చికెన్ ధరలు ఇలా ఉండగా.. ఏపీ లో చికెన్ ధరలు మరింత పెరిగినట్లు స్పష్టం అవుతోంది.
విజయవాడ జోన్ లో కిలో చికెన్ స్కిన్ లెస్ ధర రూ.266 గా ఉంది. అలాగే డ్రస్డ్ చికెన్ ధర రూ.236 గా ఉంది. ఇక రిటైల్ లైవ్ బర్డ్ ధర చూస్తే రూ. 152 గా ఉన్నట్లు సమాచారం. అలాగే ఫారంలో లైవ్ బర్డ్ ధర రూ. 125 గా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అటు కోడిగుడ్ల ధరలు కూడా భారీగానే పెరిగాయి. హైదరాబాద్ లో 12 గుడ్ల రిటైల్ ధర రూ.88 గా ఉంది. అలాగే విజయవాడ జోన్ పరిధిలో రూ. 80గా ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ఇక ముఖ్యంగా క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సమయంలో చికెన్, ఎగ్స్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి పెరుగుతున్న దాణా ఖర్చుల నేపథ్యంలో పౌల్ట్రీ ఉత్పత్తి 20 శాతానికి పైగా తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.












Click it and Unblock the Notifications
