అమ్మ ఆద్య.. కూతురిని తలచుకొని కుమిలిన తండ్రి, రైల్వే పట్టాలపై కల్యాణ్ బలవన్మరణం..
ఆ చిన్నారితో ఇల్లు సందడిగా ఉండేది. అమ్మ అలనా పాలానా చూస్తుండగా... నాన్నతో ముద్దు ముచ్చట్లు కొనసాగేవి. కానీ తల్లి అనూష మాత్రం ప్రేమించిన కల్యాణ్‌కు ద్రోహం చేసింది. సోషల్ మీడియాలో పరిచయమైన కరుణాకర్‌తో స్నేహం.. కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. తర్వాత అతని స్నేహితుడు రాజశేఖర్‌ను పరిచయం చేయగా వారి మధ్య గాఢమైన బంధం కొనసాగింది. ఇది జీర్ణించుకోలేని కరుణాకర్ ఈ నెల 2వ తేదీ (గురువారం) అనూష ఇంటికొచ్చాడు. అనూష అతని లవర్ రాజశేఖర్‌పై దాడి చేశాడు. అయితే అతను బాత్రూంలో ఉండటంతో చిన్నారి ఆద్యను పొట్టనపెట్టుకోవడం సంచలనం కలిగించింది. భార్య చేసిన తప్పుకు.. భర్త కల్యాణ్ మనో వేదనకు గురయ్యాడు. తన కూతురు లేదు అనే విషయం జీర్ణించుకోలేకపోయాడు.

కూతురిని తలచుకొని
2వ తేదీ నుంచి కల్యాణ్ ఏదో కోల్పోయినట్టు ఉంటున్నాడు. పాప మాత్రం కళ్ల ముందే కదలాడుతోంది. ఇటు భార్య వివాహేతర సంబంధాలు తెలుసుకొని.. విరక్తి కలిగింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అమ్మ ఆద్య.. వస్తున్న అంటూ శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. భువనగిరి రైల్వే ట్రాక్ వద్ద సూసైడ్ చేసుకున్నాడు. 9 రోజుల్లో చనిపోయిన కూతురు వద్దకు కల్యాణ్ వెళ్లిపోయాడు. ఓ భార్య చేసిన తప్పు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు.. తర్వాత భర్త కూడా చనిపోవడంతో జీవితం మోడుబారిపోయింది.

పచ్చని కాపురంలో..
మేడ్చల్ జిల్లా పోచారం ఇస్మాయిల్‌గూడ విహార్ హోమ్స్‌లో అనూష-కల్యాణ్ దంపతులు ఉంటున్నారు. వీరికి ఎనిమిదేళ్ల క్రితం వివాహాం కాగా.. ఆరేళ్ల కూతురు ఆద్య ఉంది. కల్యాణ్ ఆత్మకూరు గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కానీ అనూష తీరు సరిగా లేదు. సోషల్ మీడియా.. ఫేస్‌బుక్‌లో కరుణాకర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అలా వారిద్దరికీ వివాహేతర సంబంధం కూడా ఏర్పడింది. అయితే కరుణాకర్ స్నేహితుడు రమేశ్ కూడా అనూషతో పరిచయం ఏర్పడింది. అతను కూడా అనూషతో వివాహేతర సంబంధం కొనసాగించాడు.

మందలించినా.. రానీ మార్పు
అనూష తీరు గురించి ఇరుగుపొరుగు వారు చెప్పడంతో.. భర్త కల్యాణ్ మందలించాడు. దీంతో ఆమె కరుణాకర్‌ను పక్కనపెట్టింది. దీంతో అతను రగిలిపోయాడు. కానీ రమేశ్‌తో వివాహేతర సంబంధాన్ని కంటిన్యూ చేస్తోంది. ఈ విషయం ఎలాగోలా కరుణాకర్ తెలుసుకున్నాడు. వారిద్దరినీ ఏమైనా చేద్దాం అని ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వచ్చాడు. అయితే కరుణాకర్ రాకను గమనించిన అనూష.. రమేష్‌ను బాత్రూంలో దాచింది. ఇంట్లోకి వచ్చిన కరుణాకర్.. బయటకు రావాలని కోరాడు. ఎంతకీ రాకపోవడంతో పాప గొంతుపై కత్తిపెట్టాడు.
Recommended Video

అనూష వల్లే..
పాప మెడపై కత్తితో దాడిచేశాడు. ఆద్య అరవడంతో రమేశ్ బయటకు వచ్చాడు. కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించగా రమేశ్ పరుగు తీశాడు. తర్వాత తన గొంతు కూడా కోసుకున్నాడు. మెడపై గాయం కావడంతో అతనిని పోలీసులు ఉప్పల్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తర్వాత 7వ తేదీన కరుణాకర్‌ను రిమాండ్‌కు తరలించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications