మూడేళ్ల చిన్నారి శరీరంలో 10 సిరంజీ సూదులు.. షాక్ తిన్న తల్లిదండ్రులు..
మూడేళ్ల చిన్నారి శరీరంలో సిరంజీలను గుర్తించిన ఘటన వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలో వెలుగుచూసింది. ఒకటీ,రెండు కాదు ఏకంగా 10 సిరంజీలు బాలుడి శరీరంలో ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు షాక్ తిన్నారు. ఎవరో కావాలనే తమ కొడుకు శరీరంలోకి సూదులు గుచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు.
Recommended Video

వివరాల్లోకి వెళ్తే.. వీపనగండ్ల మండలం పెబ్బేటికి చెందిన అశోక్,అన్నపూర్ణ దంపతులకు లోకనాథ్(3) అనే చంటిబిడ్డ ఉన్నాడు. గత 15 రోజులుగా ఆ చిన్నారి గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూనే ఉన్నాడు. దీంతో అనారోగ్యం కారణమేమో అని తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల్లో చూపించినా లాభం లేకపోయింది. తల్లిదండ్రులు ఓరోజు అనుకోకుండా ఆ చిన్నారి మలద్వారం వద్ద పరిశీలించగా.. ఒక సూది కనిపించింది. హుటాహుటిన వనపర్తిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి ఎక్స్‌రే తీయించారు.

బాలుడి శరీరంలో మొత్తం 10 సిరంజీ సూదులు ఉన్నట్టు ఎక్స్‌రేలో బయటపడింది. దీంతో సూదులు తమ కొడుకు శరీరంలోకి ఎలా వెళ్లాయో తెలియక వాళ్లు భోరుమన్నారు. ఎవరో కావాలనే ఇలా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కొంతమంది అనుమానితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుపుతున్నామని స్థానిక ఎస్ఐ తెలిపారు. ఇక చిన్నారి శరీరంలో ఉన్న ఆ సూదులన్నింటినీ ఒకేసారి బయటకు తీయడం సాధ్యం కాదంటున్నారు వైద్యులు. శస్త్ర చికిత్స ద్వారా ఇప్పటికే కొన్ని సూదులను తొలగించామని.. మరికొన్నింటిని తొలగించాల్సి ఉందని చెప్పారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications