సీఎం కేసీఆర్ పై చినజీయర్ ఆసక్తి కర వ్యాఖ్యలు : ప్రతిపక్షం- విపక్షం రాజకీయాల్లోనే..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విభేదాలు తలెత్తాయంటూ వస్తున్న వార్తల పైన చినజీయర్ స్వామి స్పందించారు. ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ముచ్చింతల్‌లో శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఘనంగా ముగియటంతో రేపు శాంతి కళ్యాణం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభించి రాత్రి 8 గంటల తర్వాత శాంతి కళ్యాణాన్ని పూర్తిచేయనున్నట్టు తెలిపారు.. రామానుజ చార్యుల సోపాన మార్గంలో కళ్యాణము నిర్వహిస్తామని.. 108 కళ్యాణాలు ఒకే చోట జరిగిన చరిత్ర లేదన్నారు. అందరినీ ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.
Recommended Video

సీఎం కేసీఆర్ తో విభేదాలా
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుతో తమకు విభేదాలు ఎందుకు ఉంటాయని.. ఆయన సహకారం ఉన్నందనే కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నేను మొదటి వాలంటీర్‌ను అని కేసీఆరే అన్నారని గుర్తుచేసుకున్నారు. సీఎం కేసీఆర్ రాకపోవడానికి అనారోగ్యం, పని ఒత్తిడి అవ్వొచ్చని అన్నారు. కేసీఆర్‌తో విభేదాలు అని సృష్టించడమే సరికాదని చిన జీయర్ చెప్పుకొచ్చారు. తమకు అదరూ సమానమేనని చెబుతూ..ప్రతిపక్షం, స్వపక్షం రాజకీయాల్లోనే ఉంటాయని అన్నారు. రేపటి కార్యక్రమానికి కూడా అందరినీ ఆహ్వానించామని తెలిపారు.. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు ముస్లిం లీడర్లను కూడా ఆహ్వానించామని చెప్పారు.

రేపు శాంతి కళ్యాణానికి ఆహ్వానించాం
అరబిక్ భాషలో కూడా ఆహ్వాన పత్రికలను అచ్చువేయించామని వెల్లడించారు. ఇక, రామానుజ చార్యుల విగ్రహాన్ని ప్రతి రోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకు దర్శనానికి అనుమతి ఇస్తున్నామని తెలిపారు.. వీలు అయితే ఆదివారం నుంచి రామానుజ సువర్ణ మూర్తి దర్శనంకు కార్యనిర్వహకులు ఏర్పాట్లు చేస్తున్నారని చినజీయర్ స్వామి పేర్కొన్నారు. రేపు 108 దివ్యదేశాల ఆలయాల్లో మూర్తులకు శాంతి కల్యాణం జరుగుతుందని వివరించారు. రేపు నిర్వహించే శాంతి కల్యాణానికి కూడా సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించామని తెలిపారు.అయితే ఆయన వస్తారో.. రారో చూడాలని చిన్న జీయర్‌స్వామి పేర్కొన్నారు.

కేసీఆర్ హాజరు పై ఉత్కంఠ
సమతామూర్తి విగ్రహావిష్కరణ కోసం ప్రధాని రాగా.. ఆ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. అంతకు ముందు తాను ప్రధానిని ప్రోటోకాల్ ప్రకారం స్వాగతిస్తానని.. అదే సమయంలో ఆయన్ను అడగాల్సినవి అడుగుతానని చెప్పుకొచ్చారు. అయితే, సీఎం కేసీఆర్ కు జ్వరం కారణంగా ప్రధాని టూర్ కు దూరంగా ఉన్నట్లుగా నాలుగు రోజుల క్రితం జరిగిన మీడియా సమావేశంలోనూ కేసీఆర్ వెల్లడించారు. ఇక, చినజీయర్ స్వామితో విభేదాల అంశం పైన ఈ రోజున స్వయంగా చిన జీయర్ స్వామి వివరణ ఇచ్చారు. అయితే, శనివారం ముచ్చింతల్ లో జరిగే శాంతి కళ్యాణానికి సీఎం కేసీఆర్ హాజరు అవుతారా లేదా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications