చిరంజీవికి అలాంటివి అలవాటు లేదు: ఆర్టిస్ట్ శంకర్‌కే చెల్లింది (ఫొటోలు)

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి సాధారణంగా ఏ కార్యక్రమానికి కూడా వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపరు. ఆర్టిస్ట్ శంకర్ తన గ్యాలరీని ప్రారంభించడానికి ఆహ్వానించినప్పుడు కూడా చిరంజీవి అదే విషయం చెప్పారట. "నేను ఎక్కడికీ రాను, నీకు తెలుసు కదా" అన్నారట. శంకర్ బక్కోడే కానీ పట్టుదల కలవాడు. మీరు రావాల్సిందేనని పట్టుబట్టాడట.

మీరు వస్తేనే ప్రదర్శన ఉంటుందని శంకర్ చెప్పాడట. నేను రాకపోతే అని చిరంజీవి అంటే, ప్రదర్శన ఉండదని చెప్పాడట. ఆ తర్వాత పది రోజులకు చిరంజీవి తన సమ్మతిని తెలియజేస్తూ శంకర్‌కు సమాచారం అందించాడు. అంతే, చిరంజీవి శంకర్ ఆర్ట్‌కి ఫిదా అయిపోయారు.

చిరంజీవిని ఆహ్వానించడానికి కారణం ఏమిటని అడిగితే తన తల్లి రాజ్యం చిరంజీవి అభిమాని అని శంకర్ చెప్పాడు. రాజ్యం పేరు ఎందుకు పెట్టారంటే ఆగస్టు 15వ తేదీన ఆమె జన్మించిందట. ఏమైనా, శంకర్ తల్లి సెంటిమెంట్‌ను బాగానే పండించాడని అనిపించింది.

అబ్దుల్ కలాం బొమ్మ వేయడం కష్టమే...

అబ్దుల్ కలాం బొమ్మ వేయడం కష్టమే...

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ గురించి దేశానికే కాదు, ప్రపంచానికి కూడా తెలుసు. ఆయన భారతదేశం మాజీ రాష్ట్రపతి. తన కోసం సంపదను పోగు చేసుకోని మహానుభావుడు. గొప్ప శాస్త్రవేత్త. వైజ్ఝానిక శాస్త్రంలో, ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనల్లో ఆయన చేసిన కృషి భారతదేశానికి ఎనలేని పేరును తెచ్చి పెట్టింది. అబ్దుల్ కలామ్ కారికేచర్‌ను గీసి శంకర్ ఆయనకు అందజేశారు.

వరల్డ్ ప్రెస్ కార్టూన్ అవార్డు...

వరల్డ్ ప్రెస్ కార్టూన్ అవార్డు...

ఎక్కడో తెలంగాణలోని నల్లగొండ జిల్లా మారుమూల గ్రామంలో జన్మించి సైన్ బోర్డులు రాసుకుంటూ ఉన్న పామర్తి శంకర్ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు కార్టూన్‌కు ఖ్యాతిని తెచ్చిపెట్టారు. ఆయనకు 2015లో వరల్డ్ ప్రెస్ కార్టూన్ అవార్డు లభించింది. దాన్ని అందుకుంటూ ఇలా కనిపించాడు పామర్తి శంకర్.

ఫెస్‌బుక్ లోగోలో జుకర్ బర్గ్

ఫెస్‌బుక్ లోగోలో జుకర్ బర్గ్

క్యారికేచర్లకు కొత్త రూపు దిద్దినవాడు మన తెలుగు కార్టూనిస్టు పామర్తి శంకర్ అంటే ఆశ్చర్యపోవాల్సిందే. క్యారికేచర్ అంటే ముఖం వరకు గీసి వదిలేయడమే ఉండేది. కానీ, శంకర్ అందులో ప్రయోగాలు చేశాడు. ప్రముఖులు ప్రసిద్ధి చెందిన రంగాలను తన క్యారికేచర్‌లో చూపించే ప్రయత్నాలు చేశాడు. జుకర్ బర్గ్‌ను ఆయన ఇలా ఫేస్‌బుక్ లోగోలో ఫిట్ చేసి, తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.

చిరంజీవి తన క్యారికేచర్‌తో ఇలా....

చిరంజీవి తన క్యారికేచర్‌తో ఇలా....

మొత్తం మీద పామర్తి శంకర్ చిరంజీవి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. శంకర్ గీసిన తన క్యారికేచర్‌తో చిరంజీవి ఇలా ఫోజు ఇచ్చాడంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన తర్వాత కూడా చిరంజీవి తనతో టచ్‌లో ఉన్నారని శంకర్ చెప్పాడు.

ఆర్‌కె లక్ష్మణ్...

ఆర్‌కె లక్ష్మణ్...

భారతదేశంలో కార్టూన్‌కు పెట్టింది పేరు ఆర్‌కె లక్ష్మణ్. ఆర్‌కె లక్ష్మణ్ పేరు చెప్తే పామర్తి శంకర్ తన్మయత్వ చెందుతాడు. కళాకారుడంటే అలా ఉండాలన్నా అన్నాడు. దేశదేశాలు తిరిగేవాడు. ఆర్టిస్టు నిలువనీరులా ఒకే చోట ఉండి పోకూడదంటాడు ఆయన. ఆర్‌కె లక్ష్మణ్ గురించి అన్ కామన్‌మ్యాన్ అంటూ పామర్తి శంకర్ రాసిన వ్యాసం చాలా మందిని ఆకట్టుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+