రామ్ గోపాల్ వర్మ ట్వీట్లపై.. నిన్న పవన్ కళ్యాణ్, నేడు చిరంజీవి కూతురు
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ల పైన కాంగ్రెస్ పార్టీ నేత, మెగాస్టార్ చిరంజీవి కూతురు సుష్మిత ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ల పైన కాంగ్రెస్ పార్టీ నేత, మెగాస్టార్ చిరంజీవి కూతురు సుష్మిత ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. వర్మ ట్విట్టర్ ద్వారా చేసే కామెంట్లను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.
లంచ్ బ్రేక్‌లో మాట్లాడుకోవడానికి తప్ప ఆ కామెంట్లు ఎందుకూ పనికి రావని అన్నారు. ఖాళీ సమయంలో వర్మ ట్వీట్లు చూసి నవ్వుకుంటామని చెప్పారు. ఒకరు మాట్లాడే మాటలను మనం నియంత్రించలేమని చెప్పారు.
ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉందని తెలిపారు. అయితే, పూర్తిగా నెగిటివ్‌గా మాట్లాడే వారిని సామాజిక మాధ్యమాల నుంచి బ్లాక్ చేయాలన్నారు.
కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఓసారి తనను మెచ్చుకోవచ్చు, మరోసారి తిట్టవచ్చునని... కానీ వర్మ ట్వీట్ల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. పెళ్లైన కూతురును పెట్టుకొని పోర్న్ వీడియోలు దగ్గర ఉంచుకుంటానని చెప్పిన అతని గురించి ఏం మాట్లాడుతామని వ్యాఖ్యానించారు. ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ వేడుకలో నాగబాబు దుమ్మెత్తిపోశారు.
-
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications