రేవంత్ కు చిరంజీవి ఫోన్, భేటీకి దూరం - అసలు కారణం..!!

రేవంత్ తో టాలీవుడ్ భేటీ ఆసక్తిని పెంచుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో సంక్రాంతి సినిమా ల భవిష్యత్ రేవంత్ నిర్ణయం పై ఆధారపడి ఉంది. సంధ్యా థియేటర్ ఘటనతో పాటుగా సినీ పరిశ్రమ సమస్యల పైన ఈ భేటీలో చర్చించనున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులు సమావేశం జరిగే కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు. అయితే, అనూహ్యంగా ఈ భేటీకి మెగాస్టార్ చిరంజీవి దూరంగా ఉన్నారు. దీంతో, కొత్త చర్చ తెర మీదకు వచ్చింది.

చిరంజీవి గైర్హాజరు
సీఎం రేవంత్ తో సమావేశానికి సర్వం సిద్దమైంది. సినీ ప్రముఖులు బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, దిల్ రాజు, మురళీ మోహన్, శ్యాం ప్రసాద్ రెడ్డి, శివ బాలాజీ, బోయపాటి శ్రీను, రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, కిరణ్ అబ్బవరం, ఎలమంచిలి రవి, నాగార్జున ఇప్పటికే సమావేశం కోసం వచ్చారు. కాగా, ఈ సమావేశం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన చిరంజీవి మాత్రం రాలేదు. మెగా హీరోల్లో వరుణ్ తేజ్ హాజరయ్యారు. అల్లు అరవింద్ .. దిల్ రాజు ఈ టీం ను లీడ్ చేస్తున్నారు. అయితే, చిరంజీవి గైర్హాజరు వెనుక పలు కారణాల పైన చర్చ జరుగుతోంది.

Chiranjeevi skips meeting with CM Revanth over Tollywood issues and Benefit show controversy

మెగా టీం సిద్దం
సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీని ఏర్పాటు చేయించిన మెగాస్టార్ చిరంజీవి ఈ సమావే శానికి హాజరు కావడం లేదు. అయితే, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో ఆయన మాట్లాడారని తెలు స్తోంది. రేవంత్ తో భేటీ అయ్యే టీం ను డిసైడ్ చేయటంలో చిరంజీవి కీలక పాత్ర పోషించారు. చిరు సూచన మేరకు సినిమా ఇండస్ట్రీలోని అన్ని విభాగాల ప్రముఖులు హాజరవుతున్నారు. ఇక, హీరో నాగార్జున ఈ భేటీలో ప్రత్యేకంగా పాల్గొంటున్నారు. అయితే, అల్లు అర్జున్ వివాదంలో మెగా హీరోల ప్రతీ అడుగు చర్చగానే నిలిచింది. అల్లు అర్జున్ అరెస్ట్ తరువాత చిరంజీవి, నాగబాబు ఇద్దరూ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. జైలు నుంచి వచ్చిన తరువాత అదే విధంగా అల్లు అర్జున్ వారిద్దరి ఇళ్లకు వెళ్లారు.

రేవంత్ తో మెగా చర్చలు
కాగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మాత్రం తొలి నుంచి ఈ వివాదానికి దూరంగా ఉన్నారు. అయితే, ఈ సంక్రాంతికి రాం చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా సైతం విడుదల కానుంది. తెలంగాణ ప్రభుత్వం బెనిఫట్ షోలు.. టికెట్ ధరల పెంపు పైన నిర్ణయం వెనక్కు తీసుకోకుంటే నష్టం తప్పదనే అంచనాలు ఉన్నాయి. దీంతో, రేవంత్ ను ఒప్పించి.. ఆ నిర్ణయంలో సడలింపు కోసం దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ భేటీ ఏర్పాటు చేసారు. అయితే, ఈ భేటీ ఏర్పాటుకు తొలి నుంచి పూర్తి ప్రయత్నాలు చేసిన చిరంజీవి ప్రస్తుతం విదేశాలలో ఉన్నారని తెలుస్తుంది. అయితే, రేవంత్ తో ఫోన్ లో మాట్లాడిన సమయంలోనే కీలక అంశాలను ప్రస్తావన చేసినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+